క్రైమ్/లీగల్

కారు దూసుకెళ్లి.. భార్యాభర్తలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, సెప్టెంబర్ 12: పొట్టకూటి కోసం కల్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న గీత కార్మిక దంపతులను కారు మృత్యుశకటమై పొట్టనపెట్టుకుంది. ఘటన చౌటుప్పల్ మండలంలోని గుండ్లబావి శివారులో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. మండలంలోని గుండ్లబావికి చెందిన చీకూరి బాలయ్య (65), చీకూరి యాదమ్మ (53) దంపతులు కల్లు అమ్ముకుంటూ గత నాలుగు దశాబ్దాలుగా కాలం నెట్టుకువస్తున్నారు. రోజువారిగానే తాటి చెట్ల నుంచి కల్లుతీసి భర్త బాలయ్య హైవే పక్కన ఉన్న కల్లు విక్రయించే అడ్డా వద్దకు వచ్చాడు. భార్య యాదమ్మతో కలిసి రోడ్డు పక్కన కల్లు పెట్టుకోని అమ్మేందుకు కూర్చున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కేబీహెచ్‌బీ కాలనీలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కృష్ట కుమారుడికి అన్నప్రసన్నం చేసేందుకు సొంతూరైన నర్సరావుపేటకు వెళ్లి మారుతీ షిఫ్ట్ ఏపీ 10 ఏటీ 3163లో తిరిగి అతివేగంగా వస్తున్నాడు. గుండ్లబావి శివారులోకి రాగానే అదుపు తప్పి కల్లు అమ్ముకునేందుకు రోడ్డు పక్కన కూర్చున్న దంపతులపైకి దూసుకువెళ్లింది. సుమారు వంద మీటర్ల దూరం నెట్టుకుపోయింది. యాదమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందగా బాలయ్యను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కారు రోడ్డు పక్కన గుంతలోకి దూసుకువెళ్తూ సుమారు రెండువందల మీటర్ల వరకూ దూసుకువెళ్లి భూమికి నాటిన హద్దురాళ్లకు తగిలి ఆగింది. కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ బాపురెడ్డి సందర్శించి ప్రమాదం వివరాలను తెలుసుకున్నారు. ఎస్‌ఐ నవీన్‌బాబు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. శవాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.