నల్గొండ

ఆంధ్ర పార్టీలను తరిమికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుగోడు, సెప్టెంబర్ 12: గతంలో 60 సంవత్సరాలు పాలించి మునుగోడును అంధకారంలోకి నెట్టిన ఆంధ్ర పార్టీలను తరిమికొట్టాలని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో నియోజవకర్గ అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓటు వేస్తే మునుగోడు మరో 30 ఏళ్లు అభివృద్ధిలో వెనుకబడుతుందని తెలిపారు. గత పాలకుల హయాంలో విత్తనాలు, ఎరువులు రైతులు తీసుకోవాలంటే రోజుల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చిందన్నారు. దేశానికి అన్న పెట్టే రైతన్న సంక్షేమమం కోసం టీఆర్‌ఎస్ అధికారంలో వచ్చి వెంటనే రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యతో పాటు నాణ్యమైన సన్న బియ్యంతో భోజనం అందిస్తున్న ఘనత కేసీఆర్ దక్కిందన్నారు. రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా, పెట్టుబడికి రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడికి సంవత్సరానికి ఎకరానికి 8వేలు, రైతు బీమా సౌకర్యం కల్పించి కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటివెలుగు లాంటి పథకాలు అమలు చేసి దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారన్నారు. తరతరాలుగా కాంగ్రెస్‌లో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన శివన్నగూడం రిజర్వ్‌యర్ నిర్మాణ పనులను టీడీపీ, కాంగ్రెస్‌లు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని పాలకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన నియోజవక్గంలో గులాబీ జెండాను ఎగరవేస్తామన్నారు. కేసీఆర్ ప్రకటించిన మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటితో గెలిపించాలని వారు కోరారు. ముందుగా మండల పరిధిలోని చల్మడ గ్రామం నుండి మునుగోడు వరకు బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జెల్లా మార్కండేయులు, మునుగోడు ఎంపీపీ మేడి నాగలక్ష్మి, చౌటుప్పల్ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, జిల్లా కార్యదర్శి గుర్రం సత్యం, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బండా పురుషోత్తంరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు భవనం శ్రీనివాస్‌రెడ్డి, దాడి శ్రీనివాస్‌రెడ్డి, ఐతగోని లాల్‌బహుదూర్‌గౌడ్, పాశం సురేందర్‌రెడ్డి, మేడి యాదయ్య, దండు యాదయ్య, నాయకులు ఐతగోని బుచ్చయ్య, కదిరే లింగయ్య, వీరమళ్ళ నర్సింహగౌడ్, కందుల రాజు, బంగారు రవి, పగిళ్ళ సతీష్, పాల్వాయి చెన్నారెడ్డి, కర్నాటి స్వామి, పగిళ్ల శ్రీరాములు, మేడి అశోక్, జలెందర్ పాల్గొన్నారు.