అదిలాబాద్

అగ్గి రాజేసిన అసమ్మతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 12: టికెట్ల ఖరారుతోనే టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగ అధిష్ఠానానికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. చెన్నూర్ నియోజకవర్గంలో నల్లాల ఓదెలుకు టికెట్ నిరాకరణ అనంతరం రోజుకోవిధంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకొని ఉద్రిక్త ఘటనలకు దారితీయడంతో పార్టీ అధినేత కేసీఆర్ నష్టనివారణ చర్యలపై దృష్టిసారించారు. మంగళవారం చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తన కుటుంబంతో సహా ఇంట్లో గృహనిర్బంధం విధించుకొని నిరసన తెలిపిన సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా ఇది మర్చిపోకముందే బుధవారం ఎంపి బాల్క సుమన్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఓదెలు వర్గీయులు ఇందారంలో గొడవకు దిగిన సంఘటన ఇరువర్గాల మద్య ఉద్రిక్తలకు దారితీసింది. బాల్క సుమన్‌కు స్వాగతం పలికేందుకు మహిళా కార్యకర్తలు మంగళహారతులతో ముందుకు సాగగా అక్కడికి చేరుకున్న ఓదెలు వర్గానికి చెందిన టీఆర్‌ఎస్ నేత రేగుంట్ల గట్టయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని దూసుకురావడంతో మంగళహారతుల మంటలు చెలరేగి పరిస్థితి అదుపుతప్పింది. రేగుంట్ల గట్టయ్య 80శాతం కాలిన గాయాలతో వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగానే ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్థానిక ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ను ఆరా తీసి పరిస్థితిని చక్కదిద్దాలని, లేకుంటే చెన్నూర్‌లో బాల్క సుమన్‌కు గడ్డు పరిస్థితి తప్పదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్‌లో రెండు గ్రూపులు చీలిపోయి ఎవరికివారు ప్రచారం సాగిస్తుండగా ఇక స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో నిలిచేందుకు ఓదెలు ప్రచార వ్యూహంలో నిమగ్నమైనట్లు తెలిసింది. ఇందారంలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనిని ప్రారంభించేందుకు బాల్క సుమన్ సన్నాహలు సాగిస్తుండగా ఎలాగైనా అడ్డుకొని తమ పట్టునిలుపుకునేందుకు ఓదెలు అనుచరులు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిణామాలపై కంగుతిన్న బాల్క సుమన్ స్వపక్షంలోని ప్రత్యర్థి ఓదెలుతో తాడోపేడో తేల్చుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. పనిలోపనిగా తనపై హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నల్లాల ఓదెలు వర్గంపై పోలీసు స్టేషన్‌లో ఎంపి ఫిర్యాదు చేయడం ఆ పార్టీలో దుమారం రేపుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే టీఆర్‌ఎస్‌లో గ్రూపు రాజకీయాలు తార స్థాయికి చేరుకొని యుద్దవాతావరణం నెలకొనడంతో ప్రతిపక్షాలు ఈ పరిణామాలను అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మరోవైపు ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో రమేష్ రాథోడ్, సిట్టింగ్ అభ్యర్థి రేఖానాయక్‌ల మద్య పచ్చగడ్డివేస్తే బగ్గుమనే రీతిలో గ్రూపు విభేదాలు రాజుకున్నాయి. రమేష్ రాథోడ్ దిష్టిబొమ్మలను రేఖావర్గీయులు తగలబెడుతూ ఘాటైన ఆరోపణలకు దిగుతుండడంతో రెండు రోజుల్లో టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా, అనుకూలిస్తే కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసేందుకు రమేష్ రాథోడ్ సమాయత్తమవుతున్నారు. టీఆర్‌ఎస్‌లో ముదిరిన గ్రూపు విబేధాలు ఎటువైపు దారితీస్తాయోనన్నది పార్టీ సీనియర్లకు, అధిష్ఠానానికి అంతుపట్టని సమస్యగా తయారైంది.