అదిలాబాద్

గరం గరంగా ప్రజావేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండేపల్లి, సెప్టెంబర్ 12: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి గోళ్ళ మంజుల అధ్యక్షతన నిర్వహించిన ఉపాధి హామి 10 వ విడిత ప్రజా వేధిక గరం గరంగా సాగింది. మండలంలోని పెద్దపేట గ్రామ క్షేత్రసహయకుడు సరిగా పని చేయడం లేదని కూలి డబ్బులు ఇప్పించడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయగా కావాలనే రాజకీయం చేస్తున్నారని మరో వర్గం ప్రజలు ఆందోళనకు దిగి పరస్పరం తోపులాటకు దిగడంతో పోలీస్‌లు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింప చేశారు. నర్సాపూర్ గ్రామంలో ఉపాధి హామీ నిధులు అవకతవకలకు పాలుపడ్డరని వేంటనే బాధ్యులలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కూలీలు, యూత్ సభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వేధిక రాత్రి పోద్దుపోయే వరకు కూడ కోనసాగే అవకాశాలు ఉండటంతో పూర్తి వివరాలు గురువారం వేల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఎపిడి శంకర్, తహశీల్దార్ రామచంద్రయ్య, ఎంపిడివో టి.శ్రీనివాస్, విలజీలెన్స్ అధికారి సుధాకర్, ప్రాజెక్ట్ అధికారి రాజశేఖర్, ఎస్సార్పి రాము, ఇసి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి
* టీబీజీకేఎస్ కార్పొరేట్ చర్చల కమిటీ ప్రతినిధి మంగిలాల్
తాండూర్, సెప్టెంబర్ 12: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి టీబీజీకేఎస్ నిరంతరం కృషి చేస్తున్నదని ఆ యూనియన్ కార్పొరేట్ చర్చల కమిటీ ప్రతినిధి ధరావత్ మంగిలాల్ అన్నారు. మాదారంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి కార్పొరేట్ స్టక్చర్ కమిటీ సమావేశంలో పొందపర్చిన కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. 2011 తర్వాత డెయిలిరేటెడ్ నుండి మంత్లీ పెయిడ్‌గా మారిన వారికి ఇంక్రిమెంట్ విషయంలో అవకతవకలు జరుగుతున్నయని టీబీజీకేఎస్ యాజమాన్యం దృష్టికి తెగా, వారికి ఇంక్రిమెంట్ తిరిగి ఇవ్వడానికి అంగీకరించడం జరిగిందన్నారు. మైనార్టీ బెనిఫిట్ 01.09.2018 నుండి లభిస్తుందన్నారు. మైనింగ్ డిప్లొమ, డిగ్రీ చేసి ఉన్నవారికి అప్రెంటిషిప్ ఇప్పించుటకు సర్క్యులర్ ఇప్పించడం జరిగిందన్నారు. డిప్లొమ వారికి 2019 జనవరి నుండి ఆయా జీఏంలకు దరఖాస్తులు పెట్టుకోవాలని ఆయన సూచించారు. క్యాడర్ స్కీంను కూడా సాధించడం జరిగిందన్నారు. కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే ధ్యేయమే టీబీజీకేఎస్ ముందుండి పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో నాయకులు దుగుట శ్రీనివాస్, భూమయ్య, ఎర్రయ్య, రామస్వామి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.