వరంగల్

‘మాకు బ్యాంకులు వద్దు.. పోస్ట్ఫాసు ముద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 12: ప్రభుత్వం వితంతువు, వికలాంగులకు పింఛన్లు ఒంటరి మహిళలకు అందిస్తున్న ఆసరా పింఛన్లను బ్యాంకుల అకౌంట్‌ల ద్వారా అందించేందుకు ఏర్పాట్లను మొగుళ్ళపల్లి మండల పర్లపల్లి గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన వృద్దులు, వికలాంగులు కొందరు బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. తమకు అందిస్తున్న ఆసరా పింఛన్లను బ్యాంకుల ద్వారా ఇవ్వడం తాము వ్యతిరేకిస్తున్నామని, ఎప్పటిలాగా పోస్ట్ఫాసులలో పింఛన్లు ఇచ్చే విధానాన్ని అమలు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో కోరారు. వృద్దులు, వికలాంగులు, ఆరోగ్యం బాగు లేని వారు, నడవలేని వారికి పోస్ట్ఫాసు సిబ్బం ది తమ ఇంటికి వచ్చి పింఛన్లు అందజేస్తున్న విధానం తమకు సంతృప్తికరంగా ఉందని వారు పేర్కొన్నారు. బ్యాంకు ద్వారా పింఛన్లు డ్రా చేసుకునే విధానం ప్రభుత్వం కల్పిస్తున్న తాజా చర్యలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్ఫాసుల ద్వారా పింఛన్లు అందే చర్యలు చేపట్టాలని యథాతధంగా అమలు చేయాలని వారు కోరారు.

గులాబీ గూటికి ‘మర్రి’ ?
* కేసీఆర్ సమక్షంలో చేరేందుకు రంగం సిద్ధం
కేసముద్రం, సెప్టెంబర్ 12: ముంద స్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు ఫిరాయింపుల పర్వం షూరూ చేస్తున్నారు. మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేసము ద్రం మార్కెట్ మాజీ చైర్మెన్ మర్రి రంగా రావు తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్న ట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీ ఆవీర్భావం నుండి ఆ పార్టీలో కొనసాగిన రంగారావు, మహబూబాబాద్ నియోజకవర్గంలో కీలకనేతగా వ్యవహరించా రు. మహబూబాబాద్ జనరల్ సీటుగా ఉన్న సమయంలో పలు మార్లు టీడీపీ టిక్కెట్ అశించి భంగపడ్డారు. ఒక పర్యాయం పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించడం, మరోమారు పార్టీలో తనకంటే జూనియర్ అయిన వేం నరేందర్‌రెడ్డికి టిక్కెట్ కేటాయించారని కినుక వహించి టీఆర్‌ఎస్ ఆవిర్భావంలోనే కేసీఆర్ సమక్షంలో రంగారావు టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే కొంత కాలం తరువాత ఆయన ఆ పార్టీనీ వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఇటీవల టీడీపీ నుండి తన వైరి పక్షానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ‘ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడం’ కుదరదనే చందంగా ఇక ఆ పార్టీలో కొనసాగడం కష్టమని తన అనుచరులతో చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. మహబూబాబాద్ టిక్కెట్ మరోసారి మాజీ ఎమ్మె ల్యే బానోత్ శంకర్‌నాయక్‌కు కేటాయించడం, కేసీఆర్‌తో రంగారావుకు సన్నిహిత సంభందాలుండటం, వైరి పక్షం కాంగ్రెస్‌లో చేరడం తదితర పరిణామాల నేపథ్యంలో తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరి మరోసారి ఈ ప్రాంతంలో ‘చక్రం’ తిప్పాలని రంగారావు తలపోస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలో కేసీఆర్ సమక్షంలో మరోసారి గులాబీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది.