వరంగల్

క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, సెప్టెంబర్ 12: క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమని వరంగల్ రూరల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్ అన్నారు. బుధవారం పరకాల శాఖ గ్రంథాలయంలో క్రి.శే. పల్లేరు స్వయంప్రభ స్మారక సాహితీ పురస్కారా సందర్భాన్ని పురస్కరించుకొని సాహితీ మిత్ర మండలి ఆధ్వర్యంలో పాఠశాల కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాస రచన, వృక్తృత్వ, దేశభక్తి, గీతాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామితి మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి కాటూరి శ్రీ్ధరాచార్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బొచ్చ వినయ్ హాజరైన్నారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ స్వయంప్రభ స్మారకార్థం విద్యార్థులకు పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకరావాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డాక్టర్ నందిని సిద్దారెడ్డి చేతుల మీదిగా బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో యెడ్ల సుధాకర్, రేపాల నర్సింహరాములు, వజ్జీరు ప్రదీప్, నెరేళ్ళ జగతి, వ్యాంసాని రాజు, అడప రాజు, ఇళయరాజా, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ పక్వాడా రాష్ట్ర స్థాయి పోటీలకు
ఉప్పరపల్లి విద్యార్థుల ఎంపిక
చెన్నారావుపేట, సెప్టెంబర్ 12: చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛపక్వాడా పోటీలలో మొదటి, తృతీయ బహుమతులను సాంధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్ ఫ్లోరెన్స్ తెలిపారు. హన్మకొండ డైట్‌లో జరిగిన ఈ పోటీలలో ‘‘స్వచ్ఛ్భారత్‌లో నీ పాత్ర’’ అను అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో 10వ తరగతి విద్యార్థిని బానోతు నందిని ప్రథమ స్థానం పొందగా, రెడ్డి బోయిన రజిని తృతీయ బహుమతులను సాధించారు. ఈనెల 15వ తేదీ హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో నందిని, రజిని పాల్గొననుట్లు ఆమె తెలిపారు.

15 నుంచి ఏంఈడీ పరీక్షలు
కేయూ క్యాంపస్, సెప్టెంబర్ 12: కాకతీయ విశ్వవిద్యాలయ ఏంఈడీ, ఫార్మాడీ, బీపార్మా పరీక్షల టైం టేబుల్ విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రానాధికారి ఆచార్య మహేందర్‌రెడ్డి తెలిపారు. ఎం ఈడీ 15 నుండి 24 వరకు, ఫార్మాడి 22 నుండి అక్టోబర్ 8 వరకు జరపనున్నాట్లు వారు తెలిపారు. ఇతర వివరాలకై యూనివర్సిటీ వైబ్ సైట్‌ను చూడవచ్చునని ఆయన చెప్పారు.