వరంగల్

సీఎం అభ్యర్థిని ప్రకటించే దమ్ముందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 12: కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ తదితర పార్టీల మహాకూటమికి చెందిన అధినేతలకు దమ్ము, దైర్యం ఉంటే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని వరంగల్ పశ్చిమ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కుడ చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మెన్ వాసుదేవరెడ్డి సవాల్ విసిరారు. బుధవారం హన్మకొండ అశోక హోటల్ కనె్వన్షన్ హాల్‌లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అప్రజస్వామిక పొత్తులతో ఏర్పాటైన మహాకూటమి అభ్యర్థులతో మాకు ఒరిగేదేమి లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో కనివినీ ఎరగని రీతిలో మహాకూటమి అభ్యర్థులను చిత్తుగా ఓడించి, టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేసారు. పశ్చిమ నియోజక వర్గంనుండి మూడుసార్లు గెలిచిన వినయ్‌భాస్కర్‌ను ఈసారి గతంలో కంటే భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎన్నిల నోటిఫికేషన్ వచ్చేలోగా ఇంకా మిగిలిపోయిన అభివృద్ది పథకాలకు శంఖుస్థాపన చేసుకుంటామని తెలిపారు. ఈ నెల 15వ తేదీన ఆర్‌ఇసీ పెట్రోల్ పంపు సమీపంలోని తారాగార్డెన్‌లో జరిగే నియోజకవర్గ స్థాయి బహిరంగ సభకు బూత్‌లెవల్‌నుండి నియెజకవర్గ స్థాయి కమిటీల సభ్యులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. ప్రెస్‌మీట్‌కు ముందుగా జరిగిన సమావేశంలో కారొరేటర్లు, సమన్వయ కమిటీ సభ్యులు, డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్నికల కార్యాచరణ, అనుసరించాలిసిన వ్యూహాపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన సోమిడి గ్రామానికి చెందిన కార్యకర్తలు తిరిగి పశ్చిమ అభ్యర్థి వినయ్‌భాస్కర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.