కరీంనగర్

టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 12: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీలో టికెట్ల కేటాయింపులో వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ఉల్లంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తామంటూ పలుమార్లు ప్రకటనలు చేసిన తెరాస అధినేత కేసీ ఆర్, ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అగ్రవర్ణాలకే పెద్దపీట వేశాడని విమర్శించారు. 56శాతమున్న బీసీలకు 65టికెట్లు ప్రకటించాల్సి ఉండగా, నామమాత్రంగా ఎంపిక చేయటం శోచనీయమన్నారు. ఇతర పార్టీలు కూడా అధికార పార్టీని అనుసరించేందుకే వ్యూహాలు పన్నుతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. తెరాస తీరును నిరసిస్తూ, కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన తలపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు స్పందించి, దామాషా ప్రకారం టికెట్లు కేటాయించాలని, లేనిపక్షంలో బీసీలకు టికెట్లు ప్రకటించిన పార్టీలకే తమ మద్దతు తెల్పుతామని హెచ్చరించారు.
నేటి నుంచి రాజన్న సన్నిధిలో గణేశ్ నవరాత్రోత్సవాలు
* 20 తేదీన మహాపూజ .. 21న నిమజ్జనం
వేములవాడ, సెప్టెంబర్ 12: రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గణేశ్ నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. స్వామివా రి సన్నిధిలో గురువారం నుంచి 21 వరకు పండు గ జరగనుంది. గురువా రం ఉదయం 7.05 గం టల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను అర్చకులు ప్రారంభిస్తారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో మూలవిరాట్ లక్ష్మీగణపతి స్వామికి అభిషేకము, నాగిరెడ్డి మండపం నందు ప్రతిష్టించే వినాయక విగ్రహానికి అర్చనలను నిర్వహిస్తారు. రాజరాజేశ్వరస్వామివారికి, పరివార దేవతలకు ప్రత్యేక పూజాకార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం శమంతకోపాఖ్యాన పఠనం అర్చకులు గావిస్తారు. చివరిరోజైనా 21 తేదీన అర్చకులు పూర్ణాహుతి నిర్వహిస్తారు. రాత్రి 7.35 గంటలకు విఘ్నేశ్వరస్వామి సేవ ఊరేగించి ధర్మగుండం నందు గణేశ్ నిమజ్జనం గావిస్తారు.