కరీంనగర్

కొండగట్టు మృతులకు.. కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల/మల్యాల 12: పాప పు ణ్యాలు ఎవరివైనా..ఆ గ్రామాల ప్రజలకు పండుగ లేకుండా చేసి.. దుఖఃసాగరంలో ముంచింది. ఈ దుర్ఘటన లో పెద్ద సంఖ్యలో మృత్యువాత పడడగా... వివరాలు ఇలా ఉన్నాయ. శనివారంపేటలో 12, డబ్బుతిమ్మాయిపల్లిలో 11, హిమ్మత్‌రావుపేట 10, రాం సాగర్‌లో 9 , తిర్మలాపూర్‌లో 5 గురు మృతిచెందారు. దీంతో ఈ ఐదు గ్రామాల్లో గణేష్ ఉత్సవాలకు పం దిళ్లు వేసినప్పటికీ లేకుండా చేసిన పాపం ఎవరిది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోనే భారీ ఘోర రోడ్డు ప్రమాదం. ఆ ఘాట్ రోడ్డు ప్ర మాదాల పాపం ఎవరిది..! ప్రభుత్వానిదా..? ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న ప్రజాప్రతినిధులదా..? వారిని ప్రశ్నించలేని పాపం మనదేనా..! అనే ప్రశ్నలతో ఎవరికీ వారే దూషించుకుం టూ .. నిందించుకుంటూ.. ఓ పక్క ప్రభుత్వాలపై శాపనార్థాలు, అధికారుల, ప్రభుత్వంపై మండిపాటు.. రోడ్ల ని ర్మాణ సమయంలో అలైన్‌మెంట్ లేకుండా ఘాట్ రోడ్డు ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వానిదా..? అధికారుల దా..? ఇన్ని ఘోర సంఘటనలు కొం డగట్టు ఘాట్ రోడ్డులో చోటుచేసుకొని పిట్టల్లా రాలుతూ అనేక మంది కుటుంబాల్లో విషాదం నింపుతూ విధివంచితుల వుతున్న కుటుంబాల రోధనలు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదా..? ఉత్తర తెలంగాణలోనే ఈ ఘాట్ రోడ్డుపై జ రిగిన ప్రతి ప్రమాదంలో పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు ప ట్టించుకున్న పాపానపోవడం లేదనే అపవాదు మూటగట్టు కుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించి పదుల సంఖ్యలో బలియైపోతున్నప్పుడే హడావుడి చేస్తూ ప్రజాప్రతినిధులు శవరాజకీయాలు చేస్తున్నారు. ప్రతి, పాలకపక్షం కలిసి ఈ ఘాట్ రోడ్డు మరోసారి నెత్తురోడకుండా మరే ఇతర కుటుంబాల్లో పెనువిషాదం చోటుచేసుకోకుండా రోడ్డుకు రీ అలైన్‌మెంట్ చేసి డేంజర్ స్పాట్లను కనుమరుగు చేసినప్పుడే వారి చిత్తశుద్ధి తేటతెల్లమవుతుందని ప్రజాప్రతినిధులు ఆత్మవిమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పాపం ఎవరిదీ..అనే ఆత్మవిమర్శ చేసుకొని ఇ లాంటి ఘటనలు పునరావృత్తం కా కుండా చర్యలు చేపట్టినప్పుడే మృతు ల ఆత్మకు శాంతిస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
రోడ్డు నిబంధనలు పాటిద్దాం
* ఆర్టీవో అఫ్రీన్ సిద్దిఖ
పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 12: రోడ్డు నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణ కోసం పాటుపడాలని పెద్దపల్లి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారిణి అఫ్రీన్ సిద్దిఖ సూచించారు. ప్రమాద రహిత జిల్లాగా పెద్దపల్లిని మార్చుదామని ఆమె పిలుపునిచ్చారు. మండలంలోని రంగంపల్లిలో గల సాయి గార్డెన్‌లో విద్యా సంస్థల బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై బుధవారం అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీవో మాట్లాడుతూ మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ, నిద్ర లేమితో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లు చెడు అలవాట్లకు లోను కాకుండా విధి నిర్వహణ చిత్తశుద్ధితో చేయాలన్నారు. వైద్యశాఖ, 108 వాహన సేవకులు, అగ్నిమాపక శాఖ అధికారులు సూచించిన విధంగా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. ఏసీపీ హబీబ్ ఖాన్ మాట్లాడుతూ డ్రైవర్లు తమ వాహనాలకు సంబంధించిన సమస్యల గురించి యజమానులతో సంప్రదించి, ఎప్పటికప్పుడూ పరిష్కరించుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారి సుదర్శన్, ఎంవీఐలు అల్లే శ్రీనివాస్, నాగలక్ష్మీ, రంగారావు, రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సిరిపురం సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.