రంగారెడ్డి

జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 12: ఓటరు జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కే.అరుణ కుమారి సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్‌లో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశంలో జేసీ మాట్లాడుతూ అభ్యర్థులు నచ్చకపోతే నోటా ఓటు వేయవచ్చని తెలిపారు. రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లాలో 797324 ఓట్లు ఉన్నాయని చెప్పారు. జనవరి 2018 నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటరు జాబితాలో పేరు నమోదుకాని వారు అక్టోబర్ తొమ్మిదో తేదీలోపు పేరు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లేటెస్ట్ మోడల్ ఎం-3ని వినియోగిస్తున్నామని, దీనిలో ఓటర్ వెరిఫేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)ని కొత్తగా ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పద్ధతితో ఓటు వేసిన వెంటనే స్లిప్ వస్తుందని దానితో ఓటు వేసినది తెలుస్తుందని, ఇది ఏడు సెకన్లు కనబడుతుందని వివరించారు. తుది ప్రచరణ జరిగేలోపు నమోదులు, తొలగింపులు, మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ స్టేషన్‌లలో విద్యుత్, తాగునీరు, వికలాంగులు లోనికి వెళ్లేందుకు సౌకర్యంగా ర్యాంప్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలిగించరాదని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో 1300, గ్రామీణ ప్రాంతాల్లో 1100 ఓటర్లకు ఒక బూత్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ప్రిసైడింగ్ అధికారి మూడు ఈవీఎంలను తీసుకెళ్తారని చెప్పారు. సమావేశంలో వికారాబాద్ ఆర్‌డీవో విశ్వనాథం, రాష్ట్ర విద్య, సంక్షేమం, వౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు జీ.నాగేందర్ గౌడ్ (టీఆర్‌ఎస్), బీజేపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ ఆర్.సాయికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.పాండు గౌడ్, మజ్దూర్ సెల్ జిల్లా కన్వీనర్ ప్యాట శంకర్, సీపీఎం నాయకులు మల్లేశ్, మహిపాల్, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాదయ్య, బీఎస్పీ నాయకుడు పెద్ది అంజయ్య, టీడీపీ నాయకులు జీ.ఉమాశేఖర్, రమణలు, కలెక్టరేట్ కార్యాలయ తహశీల్దార్ శ్రీ్ధర్ పాల్గొన్నారు.