రంగారెడ్డి

ముస్తాబైన గణనాథులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించే గణనాథుని విగ్రహాలు విక్రయానికి ముస్తాబయ్యాయి. విభిన్న రూపాలు, వింత ఆకృతులు, ఆకారాల్లో కళాకారులు చెమటోడ్చి తయారుచేసిన ప్రతిమలను భక్తులు మండపాలు ఏర్పాటుచేసి ప్రతిష్టించేందుకు పూనుకుంటున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవడంతో ప్రతియేటా ఎంతో ఉత్సాహంగా యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా వినాయక మండపాలు ఏర్పాటుచేసి నవరాత్రులు పూజలు నిర్వహించి నిమజ్జనం చేసే ఆనవాయితీ ఉంది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వివిధ రసాయనిక పదార్థాలతో తయారుచేసే వినాయక విగ్రహాలపై ప్రజల్లో పూర్తిగా చైతన్యం కరువయ్యింది. వాటి స్థానంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని స్వచ్ఛంద సంస్థలు, పరిశోధకులు, నిపుణులు పేర్కొంటున్నా ప్రజలు వాటిని పెడచెవిన పెడుతున్నారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాలు భారీ సైజులో ఉండకపోవడం ఆకర్షణీయంగా ఉండవన్న కారణంతో ప్రజలు, భక్తులు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వినాయక విగ్రహాలపైనే మొగ్గుచూపుతున్నారు. మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసినప్పటికి ప్రజల నుండి వాటికి ఆదరణ లభించకపోవడంతోనే తిరిగి రసాయక పదార్థాలను ఉపయోగించి విగ్రహాలను తయారు చేయాల్సి వస్తోందని కళాకారులు సైతం పేర్కొంటున్నారు. ఏదిఏమైనప్పటికి విభిన్న రూపాలు, వివిధ రంగులు, ఆకారాల్లో వినాయక విగ్రహాలు ఈ యేడాది నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల ఇండ్లల్లో, కాలనీల్లో ఏర్పాటు చేసే మండపాల్లో కొలువుదీరాయి.
మట్టి గణపతుల పంపిణీ
ఉప్పల్: దేవేందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉప్పల్ బీరప్పగడ్డ, చిల్కానగర్ చౌరస్తాలో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. టీడీపీ నేతలు పబ్బతి శేఖర్‌రెడ్డి, కోల రవి గౌడ్, డాక్టర్ అశోక్, చోటేమియా, రవీందర్ గౌడ్, సాయి, ప్రమోద్, హేమంత్, మధుసూదన్ రెడ్డి, ఇమాం, రాం రెడ్డి, నరేష్, రాజు పాల్గొన్నారు. ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మేకల అనలా రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజించాలని పేర్కొన్నారు.
ముస్తాబవుతున్న మండపాలు
వికారాబాద్: గురువారం నుండి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు మండపాలు అందంగా ముస్తాబవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని గాంధీకాలనీ మండపం అందంగా ముస్తాబైంది. మోముల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కాలనీమొత్తం రంగులమయమైంది. ఒకరోజు ముందే వినాయకులను మండపాల వద్దకు యువకులు ఆనందోత్సాహాల మధ్య వినాయక విగ్రహాలను తరలిస్తున్నారు.