విజయవాడ

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 12: నగరంలోని అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చేలా క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్స న్స్ కృషి చేయాలని మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. సీఎల్‌ఆర్‌పీ సభ్యులకు నిర్వహించిన 3రోజుల శిక్షణా కా ర్యక్రమం ముగింపు సందర్భంగా బుధవారం వీఎంసీ కౌన్సిల్‌హాల్లో జరిగిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడు తూ మహిళా సంఘాల బలోపేతం ద్వారా మహిళాసాధికారికత సాధించవచ్చని, ప్రతి మహిళా గ్రూపు సభ్యునిగా చేరడమే కాకుండా గ్రూపులకు అమలుచేసే ప్రతి పథకాన్ని వర్తింపచేయాలన్నారు. అలాగే ప్రజలందరూ ప్ర జాసాధికార సర్వేలో నమోదు అయ్యే లా చర్యలు తీసుకోవాలన్నారు. చంద్ర న్న బీమా, చందన్న పెళ్లి కానుక, చంద్ర న్న ఆరోగ్య బీమా తదితర అంశాలను సక్రమ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆఫ్ జనరల్ డి చంద్రశేఖర్, ఫ్లోర్ లీడర్ హరిబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కపార్తి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

పెట్టుబడిదారులకు దోచిపెట్టడమే బాబు ధ్యేయం

విజయవాడ, సెప్టెంబర్ 12: రాష్ట్రం లో సామాన్య ప్రజలు ముఖ్యంగా రైతులు అనేకానేక సమస్యలతో తల్లడిల్లుతుంటే వారిని నిర్లక్ష్యం చేస్తున్న సీ ఎం చంద్రబాబు వ్యాపారం, పెట్టుబడులు ధ్యాసతో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు దోచిపెట్టడంలోనే పూర్తిగా నిగమ్నమై ఉన్నారంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నిప్పులు చెరిగారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన ఎంతో ఉద్వేగంతో మాట్లాడారు. తా ను ఏదో చేద్దామనుకుంటే కేంద్రం అ డ్డుపడుతున్నదనే భావన ప్రజల్లో కలుగచేసేందుకు బాబు అన్ని రకాల కు యుక్తులు పన్నుతున్నారంటూ వడ్డే మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఈ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టడానికి రూ. 25వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందం టూ దుగ్గరాజుపట్నంలో ఓడరేవు నిర్మాణంకు ఆర్థికంగా లాభదాయకం కాదు అసలు సాంకేతిక సమస్య ఉంది మరో ప్రాంతాన్ని ప్రతిపాదించమంటే బాబు మాత్రం కృష్ణపట్నంకు ఆదాయం పడిపోరాదని దుగ్గరాజుపట్నంలోనే నిర్మించాలని పదే పదే కోరటం అమ్మ పెట్ట దు.. అడుక్కోనివ్వదు అన్నట్లు ఉందన్నారు. దేశంలో తొలిసారి నేషనల్ ఇ నె్వస్ట్‌మెంట్ మాన్యుఫాక్చరర్ జోన్ ఏ ర్పాటుకు ప్రకాశం జిల్లా పామరు మండలంలో ప్రభుత్వ భూమి 14 వేల ఎకరాలు ఉన్నందున కేంద్రం పచ్చజెం డా ఊపిందని రాష్ట్ర ప్రభుత్వం 1800 ఎకరాలు నేషనల్ పర్పస్ వెహికల్ కిం ద ఇవ్వటానికి అంగీకరించింది కానీ ఇంత వరకు అప్పగించలేదన్నారు. గత ఐదేళ్లలో రూ. కోట్లు పైగా నష్టపోయామన్నారు. సింగపూర్‌లో పీఎస్‌పీ సింగపూర్‌కు చెందిన ఓడరేవులో 1500 ఎకరాల్లో 52 బెర్తలు, జూరొన్ ఓడరేవులో 400 ఎకరాల్లో 12 బర్తులుంటే బందరులో ఐదు బర్త్‌ల కోసం 5500 ఎకరా లు ఎందుని ప్రశ్నించారు.