విజయవాడ

ఇబ్బందుకు లేకుండా చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), సెప్టెంబర్ 12: మూడో విడత జ్ఞాన భేరి ఈనె ల 19న మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. బుధవా రం స్థానిక హోటల్ ఫార్చూన్ మురళీపార్క్‌లో మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏర్పాట్లపై ఉన్నాతాధికారులు, పోలీస్ అధికారలతో స మీక్ష నిర్వహించారు. ఈసమీక్ష సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని పలు సూచనలు చేశారు. కృష్ణా విశ్వ విద్యాలయంలో నిర్వహించే ‘జ్ఞానభే రి’ కార్యక్రమానికి సుమారు 10 నుండి 15వేల మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తిరుపతి, విశాఖపట్నంలో జ్ఞానభేరి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని సూచించారు. జ్ఞానభేరిని జయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా వర్సిటీ, జేఎన్‌టీయూ, ఆర్జీయూకేటీ, ఎన్‌టిఆర్ అరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, ఎస్‌ఆర్‌ఎం, విట్ విద్యార్థులు వాటి అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారన్నారు. జ్ఞానభేరీ యాప్ ద్వారా విద్యార్థుల రిజిస్ట్రేషన్, ఉపన్యాసకుల ఎంపిక, కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సందేశాలు, సెక్యూరిటీ, వౌలిక సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఎక్కడ ఎలాంటి లోపాలు రాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, కలెక్టర్ లక్ష్మీకాంతం, పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజ్, పాఠశాల విద్యా కమీషనర్ జి శ్రీనివాసులు, కళాశాల విద్యా కమీషనర్ సుజాతశర్మ, సాంకేతిక విద్యా కమీషనర్ పాండాదాస్, వైస్‌చైర్మన్లు నరసింహరావు, కోటేశ్వరరావు, కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

దేవుడా!
విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 12: చిన్నపాటి వర్షానికే చెరువైన రోడ్డుతో స్థానిక క్రీస్తురాజుపురం వాసుల పరిస్థితి అధ్వానంగా మారింది. ముందు చూస్తే గొయ్యి, వెనుక చూస్తే అన్నట్టుగా మారింది. ఒక పక్క రోడ్డు విస్తరణ, మరోపక్క అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ కో సం తవ్వకాలతోపాటు గోతుల మ యమైన అధ్వాన రోడ్డుతో అవస్థలు పడుతున్నామనుకుంటే బుధవారం కురిసిన చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమైయమై మరింత దయనీయం గా మారి వేలాది మంది ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారింది. రోడ్డు మీద ప్రయాణం అంటేనే ప్ర మాదకరంగా మారిన నేపథ్యంలో ఎక్కడ గోతులున్నాయో తెలియని అయోమయంలో బుధవారం కురిసిన వర్షానికి వాహన చోదకులతోపాటు స్థానిక ప్రజలు కూడా తీవ్ర అవస్థలకు గురైయ్యారు. వర్షం నీటి పారుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ వీఎంసీ కమిషనర్ జే నివాస్ ఇప్పటికే పలుమార్లు సిబ్బందికి సూచనలే కాకుండా ఆదేశాలిచ్చి నా అవి వారి చెవికెక్కినట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా క్రీస్తురాజుపురం అమ్మా కల్యాణ మండపం నుంచి విజయనగర్ కాలనీ మెయి న్ సెంటర్ వరకూ ఉన్న రహదారి అత్యంత ప్రమాదకరంగా మారడం గమనార్హం.
ఇదిలా ఉండగా మధ్యాహ్నం కు రిసిన వర్షానికి నగరం చిత్తడి చిత్తడి గా మారింది. ఏలూరురోడ్డు, బందర్‌రోడ్డుతోపాటు నగరంలోని ఏ ప్రధాన రహదారి చూసినా వర్షం నీటితో నిండి వాహన చోదకులకు చికాకు పుట్టించాయి. వర్షం నీటికి తోడు యూజీడీ మ్యాన్‌హోల్స్ నుంచి పొంగిపొర్లిన మురుగునీరుతో దుర్వాసన వెదజల్లి తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది. ఒకపక్క గురువారం వినాయచవితి పండుగ నేపధ్యంలో పండుగకు అవసరమైన వివిధ పూజా సామగ్రి, పత్రి కొనుగోలుకు నగర ప్రజలందరూ బయటకు రావడంతో రోడ్లన్నీ ప్రయాణికులు, కొనుగోలుదారులు, వాహనదారులతో కిటకిట లాడాయి. బందర్‌రోడ్డు బెంజికంపెనీ, పిన్నమనేని పాలీ క్లీనిక్‌రోడ్డు, మొగల్‌రాజపురం, సిద్దార్ధ కాలేజ్ తదితర ప్రాంతాలు కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.