కృష్ణ

జైజై గణేశా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి: నగరంలోని వివిధ సెంటర్లలో గణపతి ఉత్సవాలను భారీగా నిర్వహించేందుకు వివిధ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నుండి గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. 10 రోజులు, 7 రోజులు, 3 రోజులు ఇలా ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.. బీసెంట్ రోడ్, ఏలూరు రోడ్, గుణదల సెంటర్, అప్సర సెంటర్, చుట్టుగుంట సెంటర్, రామవరప్పాడు రింగ్, మహాత్మా గాంధీ రోడ్, పాతబస్తీలోని పూల బావి వీధి సెంటర్, వస్తల్రత, చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ సెంటర్, శివాలయం సెంటర్, రాజీవ్ గాంధీ హోల్ సేల్ పూల మార్కెట్ సెంటర్, ఐరన్ సెంటర్, కొత్తపేట సెంటర్, భవానీపురం సెంటర్, సితార సెంటర్, కబేళా సెంటర్, స్వాతీ సెంటర్, నీలిమ సెంటర్, గొల్లపూడి సెంటర్, తదితర సెంటర్లలో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా పూజా సామగ్రి విక్రయించే ప్రాంతాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పాతబస్తీలోని కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్, శివాలయం సెంటర్, సామరంగం చౌక్ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్, పాల ఫ్యాక్టరీ సెంటర్, చిట్టినగర్ సెంటర్, స్వాతి సెంటర్, భవానీపురం సెంటర్, సితార సెంటర్, రామరాజ్యనగర్ సెంటర్, కుమ్మరి పాలెం సెంటర్, చుట్టుగుంట బిఎస్‌ఎన్‌ఎల్ సెంటర్, ఎస్‌ఆర్‌ఆర్ విఆర్‌ఆర్ కళాశాల సెంటర్, గుణదల సెంటర్, రామవరప్పాడు సెంటర్, పటమట సెంటర్, చెక్ పోస్ట్ సెంటర్, లబ్బిపేట పశువుల ఆసుపత్రి సెంటర్, కృష్ణలంక నల్లగేట్ సెంటర్, సత్యంగారి హోటల్ సెంటర్, కృష్ణలంక బస్ స్టేషన్ సెంటర్, సత్యనారాయణపురం రామకోటి సెంటర్, తదితర సెంటర్లలో చిరు వ్యాపారస్థులు గణపతి పూజా సామగ్రి అమ్మకానికి పెట్టారు. వీటిని కొనుగోలు చేసేందుకు నగర ప్రజలు అధికంగా వచ్చారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం పూజా సామగ్రి ధరలు బాగా పెరిగాయని భక్తులు వాపోతున్నారు. పువ్వులు, అరటిపళ్లు, ఛత్రం, పత్రి, వెలక్కాయలు, తదితర వాటి ధరలు గత ఏడాది కంటే ఈ సంవత్సరం పెరిగాయి. పాతబస్తీ రాజీవ్ గాంధీ హోల్‌సేల్ పూల మార్కెట్ ఉదయం నుండే కొనుగోలుదారులతో కళకళలాడింది. గణపతి నవరాత్రులు దృష్టిలో పెట్టుకుని పూల వర్తకులు వివిధ రకాల పూలను దిగుమతి చేసుకున్నారు. నగరంలోని వివిధ సెంటర్లలో బుధవారం సాయంత్రం పూజా సామగ్రి, కొనుగోలుదారులతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
దుర్గమ్మ సన్నిధిలో...
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలోని నటరాజస్వామి ప్రాంగణంలో ఉన్న గణపతి ఆలయం, చిన్న రాజగోపురం వద్ద స్వామి సన్నిధిలో గురువారం ఉదయం 9-30 గంటలకు గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలుత కలశ స్థాపన చేసిన తర్వాత ఈ రెండు ఆలయాల్లో గణపతి పూజ ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవాలు ఈ నెల 15వరకు నిర్వహిస్తున్నట్లు వైదిక కమిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. చివరి రోజైన 15న పూర్ణాహుతి జరుగుతుంది. ఇదే రోజు సాయంత్రం 5 గంటలకు స్వామి ఊరేగింపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించి కృష్ణా నదిలో నిమజ్జనం చేస్తారు. పాతబస్తీ పాత శివాలయంలోని శ్రీ సిద్ధి బుద్ది సహిత శ్రీ విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల 13న ఉత్సవాలు ప్రారంభమై ఈ నెల 22వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా స్వామి సన్నిధిలో ఉదయం, సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పాతబస్తీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అడ్డ రోడ్ సెంటర్‌లో న్యూ స్టార్ ఫ్రెండ్స్ సర్కిల్, శ్రీ విఘ్నేశ్వర నాగేంద్ర సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షుడు పొట్నూరి సునీల్ పర్యవేక్షణలో స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు, ఇదే రోజు సాయంత్రం 5 గంటలకు ఊరేగింపు నిర్వహించే విధంగా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.