కృష్ణ

సీఎం పర్యటన విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 19వ తేదీన తొలిసారిగా మచిలీపట్నం రానున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బందరు మండలం రుద్రవరం గ్రామంలో నిర్మించిన కృష్ణా విశ్వవిద్యాలయం భవనాల ప్రారంభోత్సవంతో పాటు జ్ఞానభేరి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి బుధవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి కృష్ణా వర్సిటీ నూతన భవనాలను, సీఎం సభా స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యమంత్రి రాక కోసం హెలిప్యాడ్‌ను సిద్ధం చేయాలన్నారు. జ్ఞానభేరి సభాస్థలిని మెరక చేయాలన్నారు. వాటర్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు. రుద్రవరం గ్రామంలో వెళ్లే రోడ్డును యుద్ధప్రాతిపదికన వెడల్పు చేయాలన్నారు. అలాగే పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని గుర్తించాలన్నారు. పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బూరగడ్డ రమేష్ నాయుడు, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్, ఆర్డీవో జె ఉదయ భాస్కర్, డీఎస్పీ మహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిత

*న్యాయమూర్తులు అనూరాధ, సత్యకుమారి

కైకలూరు, సెప్టెంబర్ 12: విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం కావాలని కైకలూరు సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు ఎం అనూరాధ, సత్యకుమారి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు చట్టాల పట్ల అవగాహన కల్పించారు. గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఐదుగురు ఉపాధ్యాయులను హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చైర్మన్ గురజాడ ఉదయ శంకర్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వడ్లాని శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.