ఆంధ్రప్రదేశ్‌

కార్డుదారులకు త్వరలో చిరుధాన్యాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 12: కార్డుదారులే తమకు దేవుళ్లని, దాదాపు 10వేల కోట్ల రూపాయల మేర సంస్థ అప్పుల్లో ఉన్నా, అప్పు చేసి పేదలకు పప్పుకూడు పెడుతున్నామని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. త్వరలో రాష్టవ్య్రాప్తంగా చిరుధాన్యాలను చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నగరంలోని సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువవుతున్న నేపథ్యంలో చిరుధాన్యాలను ప్రయోగాత్మంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టి 77రోజులు అయిందని, 13 జిల్లాల్లో విస్తృతంగా క్షేత్ర పర్యటన చేశానని తెలిపారు. క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయి స్టాక్ పాయింట్ల వద్ద తూకాల్లో లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కువగా అక్కడే తూకంలో లోపాలు ఉంటున్నట్లు గమనించానని తెలిపారు. లోపాలుంటే అక్కడి ఇన్‌చార్జిలను హెచ్చరించడం, మందలింపు వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పౌర సరఫరాల్లో ప్రజల సంతృప్తి స్థాయి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేషన్ కోసం ఎక్కువసార్లు తిరగాల్సి రావడం వంటి అంశాలు సంతృప్తి శాతాన్ని ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఎప్పటికప్పుడు అదనంగా సరకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతినెలా 2.2 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. బియ్యం అక్రమ తరలింపు గతంలో కన్నా తగ్గిందని, నిఘా వ్యవస్థను పెంచామని ఆయన వివరించారు.