ఆంధ్రప్రదేశ్‌

సీఎం వినాయకచవితి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 12: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి విఘ్నాలులేకుండా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఉన్న ఆటంకాలు తొలగిపోవాలన్నారు. విఘ్నేశ్వరుని చల్లని చూపు తెలుగు ప్రజలందరిపై ఉండాలన్నారు. గణేష్ నవరాత్రి మహోత్సవాలను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు.
తుంపాల చక్కెర కర్మాగారానికి రూ. 30కోట్లు
విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని తుంపాల వద్ద ఉన్న వీవీ రమణ సహకార చక్కెర కర్మాగారాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈమేరకు 30.59 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం బుధవారం పాలనా ఆమోదం తెలిపింది. చాలాకాలంగా కర్మాగార యంత్రాల మరమ్మతులు, వేతనాలు, తదితర అంశాల కోసం నిధులు కేటాయించాలని కర్మాగార యాజమాన్యం కోరుతోంది. ఈమేరకు కర్మాగారం మరమ్మతులకు 5కోట్ల రూపాయలు, వేతనాలు, జీతాల బకాయిల చెల్లింపునకు 5.09 కోట్లు, చెరకు కొనుగోలుకు 5కోట్లు, పదవీ విరమణ చేసిన కార్మికులకు వేతన, పింఛను బాకాయిలు చెల్లింపునకు 15.49 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రాంట్‌గా ఈ నిధుల విడుదలకు పాలనా ఆమోదాన్ని తెలిపింది.
కేరళ వరద బాధితులకు చెక్కు అందజేత
భారీ వరదల్లో చిక్కుకున్న కేరళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమయానికి చేసిన సాయానికి కేరళ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. కేరళకు ఇంత భారీ సాయం మరే రాష్ట్రం నుంచి అందలేదని తెలిపింది. వరదలతో కష్టాల్లో ఉన్న కేరళకు ఏపీ ప్రభుత్వం 51 కోట్ల రూపాయల మేర సాయాన్ని పంపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ సాయాన్ని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెక్కులను కేరళ ప్రభుత్వ ప్రతినిధులకు అందచేశారు. ఏపీ ప్రతినిధిగా ఆర్టీజీ సీఈవో బాబు.ఎ కూడా వెళ్లారు.