ఆంధ్రప్రదేశ్‌

నిరుద్యోగులకు వరం.. యువనేస్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: నిరాశా నిస్పృహల్లో ఉన్న నిరుద్యోగుల కలల సాకారానికి ముహూర్తం కుదిరింది. ఉపాధి శిక్షణతో పాటు ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం యువనేస్తం వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులకు అక్టోబర్ నుంచి ప్రతినెలా ఆన్‌లైన్‌లో భృతి జమ అవుతుంది. నిరుద్యోగ భృతి అంటే పింఛన్‌లా ప్రతినెలా అందించేది కాకుండా ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగాల్లో మెరుగైన పనితీరు కనబరచి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా చేయూతనివ్వటం యువనేస్తం పథకం ముఖ్య ఉద్దేశ్యం. భృతితో ఆర్థికంగా చేయూతనందిస్తూ నైపుణ్యతలో నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి యువతకు నెలకు వెయ్యి రూపాయలు చెల్లించనున్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేశాయి. అయితే ఆరంభంలోనే బాలారిష్టాలు ఎదుర్కొన్నాయి. చివరకి 20వేల మందికి మించి అందించలేమని చేతులెత్తేశాయి.
ఈ పథకం సమర్ధవంతంగా అమలుచేయలేక పోవటానికి సమాచార, సమన్వయ లోపాలే కారణాలుగా ఆయా ప్రభుత్వాలు గుర్తించాయి. వీటిని పరిశీలించి అధ్యయనం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టంగా అమలుచేసేందుకు కార్యాచరణ రూపొందించింది. లక్షల మందికి యువనేస్తం పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ చేశారు. అన్ని శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అనుసంధానం చేశారు. ఆధార్ నెంబర్ జోడిస్తే చాలు భృతికి అర్హులవునా, కాదా? అనే విషయం తేలిపోతుంది. యువనేస్తం పోర్టల్ ఒక ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజిలా పనిచేయనుంది. ఇప్పటికే ప్రకటించిన నిబంధనలకు లోబడి నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.