ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో ఆకాశ హర్మ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 12: కొత్త రాజధాని అమరావతిలో సుమారు పదెకరాల విస్తీర్ణంలో మసీదు నిర్మాణాన్ని వక్ఫ్‌బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కొత్త నగరంలో ఒకవైపు వెంకటేశ్వరుని ఆలయం, మరోవైపు మసీదు నిర్మించడం ద్వారా ప్రజా రాజధాని అన్ని మతాలు, విభిన్న సంస్కృతులకు నిలయంగా మార్చాలనేదే తమ సంకల్పమని చెప్పారు. మక్కా మసీదు నిర్మాణానికి దీటుగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా దీన్ని తీర్చిదిద్దాలన్నారు. బుధవారం రాత్రి ఉండవల్లి ప్రజావేదిక సమావేశ మందిరంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో కలిసి రాజధాని అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి సమీక్షించారు. శాసనసభ్యులు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, అల్పాదాయ వర్గాల కోసం రాజధానిలో చేపట్టిన నివాస భవనాలు, హైకోర్టు, శాసనసభ, సచివాలయ నిర్మాణాలు, రహదారులు, ఇతర వౌలిక సదుపాయాల పురోగతిపై సీఆర్డీఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ లక్ష్మీపార్థసారథి ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాజధానిలో నిర్మించే ప్రతి భవనం కొత్త నగరం అందాన్ని ద్విగుణీకృతం చేసేలా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి నిర్మాణం ప్రజలతో పాటు పర్యాటకులకు అదనపు ఆకర్షణగా నిలవాలన్నారు. నిర్ణీత వ్యవధిలో పనులన్నీ పూర్తిచేయాల్సిందేనన్నారు. కాలయాపన జరగటానికి వీల్లేదని తేల్చిచెప్పారు. నిర్మాణంలో ప్రవేశపెడుతున్న సరికొత్త సాంకేతిక పద్ధతులు, ఆధునిక యంత్ర సామగ్రి పనుల్లో వేగం పెంచేలా ఉండాలని, కానీ వీటి కారణంగా ఆలస్యం జరగరాదన్నారు. పనుల్లో నాణ్యతకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ఎక్కడా రాజీపడవద్దని స్పష్టం చేశారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలు పాటించాలని తుది రూపు అత్యుత్తమంగా ఉండాలని నిర్దేశించారు. తుదిరూపు ఆకట్టుకునే విధంగా ఉండకపోతే సంబంధిత నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త నగరంలో చేపట్టిన ప్రతి నిర్మాణాన్ని జియో ట్యాగింగ్ చేసి వర్చువల్ విధానంలో ఎక్కడి నుంచైనా సమీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతి నిర్మాణాన్ని అరుదైన అవకాశంగా భావించి యజ్ఞంలా పూర్తిచేయాలని నిర్మాణ సంస్థలను కోరారు. పర్యాటక ఆకర్షణలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతులకు సంబంధించి 20 ఫ్లోర్ల వరకు కోర్‌వాల్ నిర్మాణాన్ని వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేస్తామని సీఎర్డీఎ కమిషనర్ వివరించారు. 2021 జనవరి 15 నాటికి సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణాన్ని పూర్తిచేసి సీఆర్డీఏకు అప్పగించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. పర్యాటకులకు ముఖ్య ఆకర్షణగా నిలిచే మూడు ప్రాజెక్టులకు సంబంధించి సమావేశంలో ముందడుగు పడింది. జలక్రీడా ఆకర్షణలతో నిలిచే అమరావతి మెరీనా, నదీ అభిముఖంగా నిర్మించనున్న అమరావతి రిసార్టు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆతిథ్యం కల్పించే అమరావతి కనె్వన్షన్ సెంటర్లకు సంబంధించి ఆయా నిర్మాణ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి సమక్షంలో లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అందుకున్నారు.