క్రైమ్/లీగల్

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్మీకిపురం, సెప్టెంబర్ 12: మదనపల్లె నుంచి తిరుపతికి ప్రయాణికులతో వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కకడే మృతి చెంది, 10 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు మదనపల్లె ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు బుధవారం మధ్యాహ్నం మదనపల్లె నుండి ప్రయాణికులను ఎక్కించుకుని తిరుపతికి బయలుదేరింది. బస్సు వాల్మీకిపురం మండలం టేకలకోన వద్దకు రాగానే నెల్లూరు నుండి బెంగళూరుకు సిలికాన్ ఇసుకతో వెళ్తున్న లారీని ఢీకొంది. ఈప్రమాదంలో లారీ డ్రైవర్ పోలయ్య(38) , బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు సావిత్రి(45) సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. బస్సులో ప్రయాణిస్తున్న 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నలుగురి పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. మదనపల్లె బసినికొండకు చెందిన డ్రైవర్ రాము బస్సు బయలుదేరినప్పటినుండి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వేగంగా బస్సును నడపడం వల్లే ఈప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. మృతిచెందిన సావిత్రి మదనపల్లెకోర్టులో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. లారీ డ్రైవర్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడుకు చెందిన పోలయ్యగా గుర్తించారు. ప్రమాదం విషయం తెలియగానే వాల్మీకిపురం సిఐ సిద్దతేజోమూర్తి సిబ్బందితో వెళ్లి ప్రయాణికులను ఆసుపత్రులకు తరలించి రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.