ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం నిధులతోనే ఏపీ అభివృద్ధి: సోము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 12: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోన్న నిధులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యావంతా వ్యక్తిగత ప్రచారానికే పరిమితమైంది తప్ప రాష్ట్భ్రావృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో బుధవారం సోము వీర్రాజు విలేఖరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు చేసినన్ని ప్రారంభోత్సవాలు దేశ చరిత్రలో మరే ఇతర ప్రాజెక్టుకు జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే గ్యాలరీ వాక్‌కు సంబంధించి శంకుస్థాపన ఆహ్వాన పత్రికలో ఒక్క ముఖ్యమంత్రి ఫొటో తప్ప ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఫొటోలు ప్రచురించకపోవడం పట్ల సోము అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పిల్‌వే గ్యాలరీ వాక్ నిర్మాణం పనులను ఎందుకు ఆలస్యంగా ప్రారంభించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు కేంద్రం సుమారు రూ. 6000 కోట్లు ఇచ్చిందని, ఈ నిధులపై ఇప్పటివరకూ ఏ విధమైన జమా ఖర్చుల వివరాలనూ తెలియజేయలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక అభివృద్ధి పనులు కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయన్నారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏ పనినైనా ప్రారంభించారా? అని ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు పెరిగితే గగ్గోలు పెడుతున్న చంద్రబాబు రాష్ట్రంలో ఐదు రూపాయలకు తయారయ్యే చీప్ లిక్కర్‌ను రూ.50కు విక్రయిస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని ఎద్దేవాచేశారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరనున్నట్టు చెప్పారు.