ఆంధ్రప్రదేశ్‌

అంతరాలు చెరిపేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి 2016-17 సంవత్సరం నుండి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దళితులు, గిరిజనుల సంక్షేమంపై గురువారం ఆయన సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దళితులు, గిరిజనులు సమాజంలోని ఇతర వర్గాలతో సమానంగా ఎదిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌సి,ఎస్‌టి ఉపప్రణాళికల నిధులను గత ప్రభుత్వాలు సద్వినియోగం చేయలేదని, తమ ప్రభుత్వం ఈ నిధులను పూర్తిగా వినియోగిస్తోందని తెలిపారు. 2016-17 సంవత్సరంలో ఎస్‌సి ఉపప్రణాళికకు 8,724 కోట్లు, ఎస్‌టి ఉప ప్రణాళికకు 3099 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 వ జయంతిని పురస్కరించుకుని ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధి, సంక్షేమంకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత అకుంటిత దీక్షతో పనిచేయాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. దళితులు, గిరిజనుల ప్రాంతాల్లో వౌలిక వసతులను కల్పిస్తామని ఆయన వివరించారు. వీరిలో అక్షరాస్యత పెంచేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న విధానాలను పటిష్టంగా అమలు చేస్తూనే, భవిష్యత్తులో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎస్‌సి, ఎస్‌టి పాఠశాలల్లో ఉత్తీర్ణతాశాతం కూడా కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు వీలవుతుందని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలని తద్వారా విద్యార్థులందరికీ రెసిడెన్షియల్ విధానంలో విద్యను సమకూర్చేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు.
అన్ని సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీచేయాలని సూచించారు. విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించాలన్నారు. టాటా ట్రస్ట్, అక్షయ పాత్ర మహారాష్టల్రో సంయుక్తంగా చేపట్టిన పౌష్టికాహార పంపిణీని ఆదర్శంగా తీసుకుని పోలవరం ప్రాంతంలో కామన్ కిచెన్ కానె్సప్ట్‌ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు మెరుగ్గా ఉండేందుకు పిపిపి (ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం) విధానాన్ని మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఎస్‌టి గ్రామాల్లో సిసి కెమెరాలు
గిరిజన గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గిరిజన కుటుంబాలన్నీ ఆదాయం అధికంగా పొందేలా చూడాల్సిన అవసరం ఉందని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. గిరిజన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ లభించేలా చూడాలని, ఈ ఉత్పత్తులకు ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ఉత్పత్తులన్నీ వాల్‌మార్ట్ తదితర సూపర్‌మార్కెట్లలో లభ్యమయ్యేలా చూడాల్సి ఉందని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో గిరిజన భవన్‌ను 1.35 కోట్లతో నిర్మిస్తామని, 12 కోట్లతో జిసిసి కార్యాలయ భవనం నిర్మిస్తామన్నారు. అలాగే విశాఖలో 20 కోట్లరూపాయలతో ట్రైబల్ మ్యూజియం నిర్మిస్తామన్నారు.
ఎస్‌సి, ఎస్‌టిలకు సమకూర్చే సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ ఆధార్‌తో అనుసంధానం చేస్తామన్నారు.

చిత్రం ఎన్టీఆర్ ట్రస్ట్భ్‌వన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ను
పచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు