2 ఫ్రెండ్స్ ట్రూలవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫరా హీరోహీరోయిన్లుగా జి.ఎల్.బి,శ్రీనివాస్ దర్శకత్వంలో అనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ముళుగూరు అనంతరాముడు, రమేష్‌నాయుడు నిర్మిస్తున్న చిత్రం 2ఫ్రెండ్స్. ట్రూ లవ్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. మంచి టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలని, తప్పకుండా ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు మరింత మంది రావాలని అన్నారు. నిర్మాత అనంతరాముడు మాట్లాడుతూ.. విద్య, వ్యవసాయం, స్థిరాస్థి, ఫైనాన్స్ రంగాల్లో విజయాలు సాధించాను. ప్రస్తుతం సినిమా రంగంలో సక్సెస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో నిర్మాతగా పరిచయమవుతున్నాను. దర్శకుడు శ్రీనివాస్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమా తీశాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రానికి సహకారం అందించారని, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉంటుందని అన్నారు.