హైదరాబాద్

కర్ణాటక నుంచి నగరానికి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ముందస్తు ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే నగరంలోని 3826 పోలింగ్ స్టేషన్లలో వౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీకి కేంద్ర ఎన్నికల సంఘం అత్యాధునికమైన, సరికొత్త 11వేల ఈవీఎంలను కేటాయించింది. వీటిని కర్ణాటక రాజధాని బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గన గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య జీహెచ్‌ఎంసీకి తరలించారు. వీటి తరలింపు, బల్దియా అధికారులకు అప్పగింతకు సంబంధించిన మొత్తం ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకత కోసం వీడియో చిత్రీకరణ జరిపారు. మహానగరంలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 3826 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఒక్కోదానిలో ఒక్కోక్కటి వినియోగం, ఎక్కడైనా యంత్రాలు మొరాయించినా, మరమ్మతుల పాలైన అప్పటికపుడు ప్రత్యామ్నాయంగా వినియోగించేందుకు వీలుగా అవసరమైన మొత్తం ఈవీఎంలలో ఇరవై శాతం రిజర్వుతో పాటు వీటిని పంపారు. వీటిలో 6120 బ్యాలెటింగ్(బీయూ) యూనిట్లు, 4780 కంట్రోల్ యూనిట్(సీయూ), వీవీ ప్యాడ్‌లు 5170 అవసరమవుతున్నట్లు బల్దియా అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపిన సమాచారం మేరకు ప్రస్తుతం మంగళవారం 6120 బ్యాలెటింగ్ యూనిట్లు, 4780 కంట్రోల్ యూనిట్లను నగరానికి తీసుకువచ్చారు. మొత్తం వీవీ ప్యాడ్‌లలో 10శాతం, మొత్తం కంట్రోల్ యూనిట్లలో 16 శాతం అదనంగా పంపారు. వీటితో పాటు వీవీ ప్యాడ్‌లు ఈ నెల 24వ తేదీన హర్యాన నుంచి నగరానికి రోడ్డుమార్గన తీసుకురానున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు. గతంలో వినియోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నందున, వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఈ సారి ముందస్తు ఎన్నికల్లో ఎలాంటి ట్యాంపరింగ్‌కు తావులేకుండా వినియోగించనున్న ఈ అత్యాధునికమైన ఈవీఎంలపై వచ్చే నెల రెండో వారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారులు, సిబ్బందికి తగిన శిక్షణనివ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రజలు కూడా వీటిని వినియోగించే తీరుపై విస్త్రృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
ఉప్పల్,సెప్టెంబర్ 18: డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవింగ్ ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పరిదిలోని మన్‌సానిపల్లి గ్రామానికి చెందిన వొల్లెపు నర్సింహులు భార్య కవితతో పాటు సోదరుడు యాదయ్య కుటుంబ సభ్యులు బతుకుదెరువు కోసం ఏడాది క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చారు. బోడుప్పల్ బొల్లిగూడెంలో నివసిస్తూ ఇదే ప్రాంతంలో మట్టి పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. యాదయ్య కుమారుడు బాపు (28)కు పుట్టిన కుమారుడిని చూసేందుకు గజ్వేల్‌కు నర్సింహులు భార్య కవిత (30), బంధువులు రజిత (27) ఆమె కుమారుడు హర్షిత్‌తో కలిసి సోమవారం ఉదయం వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఇంటికి సమీపంలోనే రాజలింగం కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరా వాహనం ఢీకొంది.నిర్యక్ష్యంగా వేగంగా డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వచ్చే వాహనం తప్పించబోయి వీరిపైకి దూసుకొచ్చింది. తీవ్రంగా గాయపడిన కవిత, బాపు అక్కడికక్కడే మరణించగా రజిత ఆమె కుమారుడు వర్షిత్ గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా మృతి చెందిన వారు నిరుపేద కుటుంబానికి చెందిన వారేనని వీరికి అంత్యక్రియల కోసం ఆర్ధిక సాయాన్ని అందించేందుకు కృషి చేయాలని మృతుల కుటుంబ సభ్యులు, బందువులు పీఎస్‌లో ఆందోళన చేశారు. కవిత మృతితో ఆమె ఇద్దరు బిడ్డలు మహేశ్వరి, గీత, చందుల రోదనలు అందరి హృదయాలను కదిలిచింది.