కరీంనగర్

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 18: గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ఈ నెల 22న జరిగే గణేష్ నిమజ్జనంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడుచోట్ల గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామని, మానకొండూర్ చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్‌లో వినాయకులను నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మూడుచోట్ల నాలుగు పెద్ద క్రేన్లు, నాలుగు చిన్న క్రేన్లను ఏర్పాటు చేయాలని, ప్రతీ క్రేన్ వద్ద ఆపరేటర్, అసిస్టెంట్ ఆపరేటర్, కూలీలను అందుబాటులో ఉంచాలని మైన్స్ ఎడిని ఆదేశించారు. అలాగే మజ్జనాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి నోడల్ అధికారులను మూడుచోట్ల నియమిస్తామని చెప్పారు. నిమజ్జన స్థలాల వద్ద బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా నగరంలో రోడ్లపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చివేయాలని, నిమజ్జనం జరిగే స్థలాల వరకు లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కరీంనగర్ నగరపాలక సంస్థ అదికారులను ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, నిమజ్జన స్థలాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అదికారులను ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా రెండ్రోజులు మద్యం దుకాణాలను బంద్ చేయించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన స్థలాల్లో అగ్నిమాపక వాహనాలతో సిద్ధంగా ఉండాలని ఫైర్ ఆఫీసర్‌ను ఆదేశించారు. అలాగే వైద్యబృందాలు ఏర్పాటు చే యాలని, 101 వాహనాన్ని అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ అందరి సహకారం తో ఈసారి కూడా గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. సీసీ కెమెరాలు, వీడియో కెమెరాలు ఏర్పాటు చేస్తామని, నిమజ్జనం మొత్తం డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, డిఆర్‌ఓ భిక్షనాయక్, అడిషనల్ డీసీపీ సంజీవ్‌కుమార్, ఆర్‌డిఓలు ఆనంద్‌కుమార్, చెన్నయ్య, డీపీఓ నారాయణ రావు, మైన్స్ ఎడి వెంకటరెడ్డి, శాంతి కమిటి సభ్యులు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నాం
* మోడల్ స్కూల్స్ జేడీ లింగయ్య
రామడుగు, సెప్టెంబర్ 18: గతంలో కాకుండా ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మోడల్ స్కూళ్లలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని, ఆద ర్శ పాఠశాల జాయింట్ డైరెక్టర్ లింగ య్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూళ్లో రెండు రోజుల పాటు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల ప్రారంభోత్సవం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జేడీ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పాఠశాలల్లో మంచి భోజనం, దుస్థులు, క్రమశిక్షణ అలవరుస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధించి పెడుతున్నారన్నారు. గతంలో ఎన్‌ఎంఎన్‌లో ఉత్తీర్ణత సా ధించిన విద్యార్థులకిచ్చే ఉపకార వేత నం 12 వేల రూపాయలకు పెంచారన్నారు. విద్యనే కాకుండా విజ్ఞాన యా త్రలు తీసుకెళ్తున్నామన్నారు. విద్యార్థులు ఎల్లలు లేని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే పాఠశాలల్లో క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంత రం మైదానంలో విద్యార్థులను పరిచయం చేసుకుంటూ ఉ న్నత చదువులు చదువుకోవాలని వారి ని ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఎంపిపి మార్కొండ కిష్టారెడ్డి, జడ్పీటీసీ వీర్ల కవిత, ఎండిఓ దేవకీ దేవి, మాజీ సర్పంచ్ పంజాల జగన్ మోహ న్ గౌడ్, ప్రిన్సిపాల్ వనజ, వివిధ పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయు లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఎఎంసి చైర్మన్ కొమురయ్య పాల్గొన్నారు.