కడప

ఆర్టీసీ మైదానంలో థమ్స్‌అప్ విన్యాసాలు.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 20:ప్రయాణీకుల సౌకర్యాలను ఏమాత్రం పట్టించుకోని ఆర్టీసీ అధికారులు, బహుళ జాతి కంపెనీల ప్రచారానికి మాత్రం రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల ప్రచారానికి ఏకంగా బస్టాండులో బస్సులు నిలిపే స్థలాలనే ఆ కంపెనీ ప్రచార విన్యాసాలకు మైదానాలుగా మార్చేశారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు బస్సుల్లో పరిశుభ్రత, నిర్ణీత వేళలకు బస్సుల రాక తదితర ప్రజాసౌకర్యాలపై దృష్టి పెట్టని అధికారులు ఇప్పటికే ఆర్టీసీ స్థలాలను లీజుల పేర్లతో ఇచ్చి, బస్సులు నిలబడేందుకు కూడా స్థలం లేకుండా చేశారు. కడప ఆర్టీసీ బస్టాండులో బస్సుల సంఖ్య పెరిగింది కానీ, అవి నిలబడేందుకు ‘్ఫ్లట్‌ఫాం పాయింట్’లు మాత్రం సరిపోయినన్ని లేవు. తిరుపతి బస్సులు నిలబడాల్సిన పాయింట్‌ను ఎత్తివేసి, బస్టాండుకు ముందుపక్క ఉన్న రహదారిలో నిలుపుతున్నారు. బస్సులు దిగి ప్రధాన ద్వారం ద్వారా బయటకు వెళ్లేవారికి ఈ తిరుపతి బస్సులు ఒక అడ్డంకిగా మారాయి. తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కూడా, తిరుపతి బస్సులు ఎక్కడ నిలబడుతున్నాయో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. బస్టాండులో బస్సులు నిలబడేందుకు ఫ్లాట్‌ఫాంల నిర్మాణం చేసేందుకు వీలులేకుండా, సంస్థకు చెందిన చుట్టు ఉన్న స్థలాన్నంతటినీ ఇప్పటికే లీజులకు ఇచ్చేశారు. బస్సులు నిలబడేందుకు స్థలం పూర్తిగా కుదించుకుపోయింది. దీనికితోడు గురువారం ‘్థమ్స్‌అప్’ కంపెనీ ప్రచారానికి జిల్లాలోని బస్టాండులన్నింటిలో అనుమతి ఇచ్చేశారు. ఈ థమ్స్‌అప్ వాహనం బస్టాండులో ఏదో ఒక మూల ఉండి తమ ప్రచారవాణిని వినిపించడం లేదు. ప్రయాణికులు ఎక్కేందుకు బస్సులు నిలబడే ఫ్లాట్‌ఫామ్‌పై తమ వాహనాన్ని నిలిపి, పెద్ద పెద్ద లౌడుస్పీకర్లతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊదరగొట్టారు. కేవలం శబ్దకాలుష్యంతో ఊదరగొట్టడమే కాదు, టైర్లతో విన్యాసాలను ఏర్పాటు చేశారు. అక్కడ గుమికూడిన ప్రయాణికులకు, బయటి నుంచి వచ్చిన ప్రజలకు విన్యాసాల పోటీలు ఏర్పాటు చేశారు. కడప జిల్లా కేంద్రంలోని బస్టాండులో పులివెందుల, ప్రొద్దుటూరుకు వెళ్లే బస్సులు నిలిపే పాయింట్‌ల వద్ద ఈ థమ్స్‌అప్ కంపెనీల విన్యాసాలు జరిగాయి. కడప నుండి ప్రొద్దుటూరుకు, పులివెందులకు నిత్యం బస్సులు రద్దీగా వెళ్లేంత ప్రయాణికుల సంఖ్య ఉంటుంది. రద్దీగా వెళ్లాల్సిన ప్రొద్దుటూరు, పులివెందుల బస్సులు నిలిపేందుకు ఫ్లాట్‌ఫామ్ పాయింట్‌లు లేక ఎక్కడో దూరంగా నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుని పోవాల్సివచ్చింది. ప్రొద్దుటూరు, పులివెందులకు వెళ్లే ప్రయాణికులు బస్సులు ఎక్కడ నిలబడుతున్నాయో తెలియక ఇక్కట్ల పాలయ్యారు. దీనికితోడు థమ్స్‌అప్ వాహనం ఫ్లాట్‌ఫామ్ పాయింట్‌లో నిలబడి, బస్టాండులో బస్సులకోసం వేచి కూర్చున్న ప్రయాణికులకు ఎదురుగా స్పీకర్లు పెట్టి చెవులు తూట్లుపడే లా శబ్ధకాలుష్యాన్ని సృష్టించారు. టైర్లతో విన్యాసాలు నిర్వహిస్తూ ఆర్టీసీ బస్టాండులోని నాలుగు ఫ్లాట్‌ఫామ్‌లను తమ మైదానంగా మార్చుకున్నారు. ఆర్టీసీ తన ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయాణీకులకు సౌకర్యాలు చేయకుండా, వారిని మరింత అసౌకర్యానికి గురిచేస్తూ ఇటువంటి అడ్డదారులు తొక్కుతోందని ప్రయాణికులు విసుక్కున్నారు. ఈ విషయమై కడప డిపో మేనేజర్‌తో మాట్లాడగా, ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున ఇటువంటి ప్రచారాలకు అనుమతిస్తున్నామని అన్నారు. ఏ ప్రచారాలకైనా ఇస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇదంతా తన పరిధిలో లేదని పై అధికారులు అన్ని బస్టాండులలో ప్రచారం చేసుకునేందుకు అనుమతించారని అన్నారు.