మహబూబ్‌నగర్

కలిసికట్టుగా కాంగ్రెస్‌ను గెలిపించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20: కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ కార్యదర్శి సురేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని భగీరథకాలనీలో గల తన స్వగృహంలో కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ను మాత్రం గెలవనివ్వమని తెలిపారు. అందుకుగాను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఓ సైనికుడిలా పని చేస్తేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌లో మాత్రం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎలాంటి పనులు చేశారో ప్రజలకు తెలుసని ఆయన ఆగడాలను అడ్డుకుంటామని ఎట్టి పరిస్థితుల్లో ఆయనను గెలవనిచ్చేది లేదని అన్నారు. టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై విద్యార్థులు, యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఉద్యోగులను సైతం దగా చేసిన కేసీఆర్‌కు తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. యువత నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి కసితో ఉన్నారని ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త సమన్వయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం తథ్యమని ఆయన తెలిపారు. త్వరలోనే అదిష్టానం టికెట్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. టికెట్ వ్యవహరం అధిష్టానం చూసుకుంటుందని ప్రస్తుతం మాత్రం అందరు ప్రజల్లో ఉండాలని తెలిపారు. పెద్ద ఎత్తున పార్టీలోకి చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని హన్వాడ, మహబూబ్‌నగర్ మండలం, అర్భన్‌లో త్వరలోనే ఇతర పార్టీలకు సంబందించిన వారు తన సమక్షంలో వేలాది మంది చేరబోతున్నారని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీని ఓడించి మహబూబ్‌నగర్‌లో మాత్రం పాగా వేదామని సురేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాగా వివిధ గ్రామాలకు చెందిన పలు పార్టీల కార్యకర్తలు సురేందర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఫకీర్ అహ్మద్, రామస్వామిగౌడ్, చెన్నయ్య, లక్ష్మణ్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌కు చేరుకున్న ఈవీఎంలు
* నిపుణులతో ఈవీఎంల పరిశీలన
* జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 20: మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల కమీషన్ జిల్లాకు కేటాయించిన ఈవీఏంలు గురువారం ఉదయం నాగర్‌కర్నూల్ పట్టణానికి చేరుకోగా, వాటిని కలెక్టర్ పర్యవేక్షణలో గోదాంలో భద్రపర్చారు. నెల్లికొండ సమీపంలోని వ్యవసాయ గోదాంలో ఈవీఎంలను తాత్కలికంగా భద్రపర్చేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక వాహనంలో ఈవీఎంలు నాగర్‌కర్నూల్‌కు రాగా, వాటిని వరుసక్రమంలో పెట్టారు. గోదాంలో భద్రపర్చిన ఈవీఎంలను జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన ఈవీఎంలు వచ్చాయని, వాటిని రెండు రోజులలో సంబంధిత కంపెనీ నిపుణుల ఆధ్వర్యంలో పరిశీలించి సీల్‌వేసే ప్రక్రియను చేపడుతామన్నారు. ఈవీఎంలలో సాప్ట్‌వేర్ అప్‌లోడ్ ప్రక్రియను సీఈఐ నుంచి వచ్చే నిపుణుల ద్వారా మొదటి లేవల్ పరిశీలిన జరుగుతుందన్నారు. ఇందుకోసం 25 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక ఇంజనీయర్ ఉంటారని తెలిపారు. పరిశీలన అనంతరం మొదటి దశ సీల్ వేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు 1240 బ్యాలెట్ యూనిట్లు, 970 కంట్రోల్ యూనిట్లు, 1050 వివిప్యాట్‌లు వచ్చాయని తెలిపారు. ఆయన వెంట జేసీ పి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో హనుమనాయక్, డీటీ ఖాజా, మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎన్నికల నోడల్ అధికారి, డీఆర్వో మధుసూధన్‌నాయక్ పర్యవేక్షణలో ఈవీఎంలను గోదాంలో పెట్టారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
కోస్గి, సెప్టెంబర్ 20: లారీ, ద్విచక్రవాహనం ఢికొని యువకుడికి తీవ్రగాయాలైన సంఘటన గురువారం కోస్గిలో చోటుచేసుకుంది. స్థానికుల, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే నారాయణపేట నుండి కోస్గి వైపు వస్తున్న ఏపి22 వి 4519 నంబర్ గల లారీ పట్టణానికి చెందిన పూసల కాళీదాసు(36) పనులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ప్రమాదంలో యువకుడికి రెండు కాళ్లు పూర్తిగా నుజ్జు నుజ్జయ్యాయి. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం 108 సహాయంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.