తూర్పుగోదావరి

ఓటర్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, సెప్టెంబర్ 20: త్వరలో జరగనున్న 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనాభా వారీగా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఎలక్ట్రోరల్ రిజస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంటు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింటు కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున సూచించారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసన సభ నియోజకవర్గాల ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలతో గురువారం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు, ఓటు ప్రాధాన్యతపై కళాశాలల్లోను, ప్రజల్లోను చేపట్టవలసిన అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలలోను ఎలక్ట్రోరల్ పాపులేషన్ రేషియోను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు గ్రామస్థాయి నుంచి ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు పరిశీలన జరిపి ఏ గ్రామంలో ఓటర్ల సంఖ్య తక్కువగా నమోదు అయ్యింది, ఇందుకు గల కారణాలను పరిశీలించి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వీటన్నింటిపైన ఒక చెక్ లిస్టు బూత్ లెవెల్ అధికారుల వద్ద ఉండాలని, చెక్ లిస్టు ఆధారంగా ప్రతీ గ్రామంలోను, ప్రతి ఇంటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు అయ్యేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ప్రతీ వార్డులో కూడా పరిశీలన జరిపి ఈపి (ఎలక్ట్రోరల్ పాపులేషన్) రేషియో పెంచేందుకు మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని జేసీ మల్లికార్జున తెలిపారు. అలాగే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కళాశాలల్లోను ఓటు నమోదు, ఓటు ప్రాధాన్యతపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను చైతన్యవంతుల్ని చేయాలని, అలాగే భవిష్యత్తు ఓటర్లకు అవగాహన కల్పించేందుకు అన్ని ఉన్నత పాఠశాలల్లోను అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని జేసీ సూచించారు. అలాగే అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద, అన్ని మండల తహసీల్దార్ల కార్యాలయాల వద్ద ఓటు నమోదు, ఓటు ప్రాధాన్యత ఏ విధంగా ఓటు నమోదు చేసుకోవాలి, ఆయా నియోజకవర్గాల ఈఆర్‌వో, ఏఈఆర్‌వోల ఫోను నెంబర్లు, వెబ్‌సైటు అడ్రస్సులు తదితర వివరాలతో ప్రదర్శన బోర్డులు లేదా ఫ్లెక్సీలు తయారుజేసి ప్రదర్శించాలని జేసీ సూచించారు. ప్రతీ ఆదివారం హ్యాపీ సండేలు నిర్వహిస్తున్నందున ఆ సమయంలో ఎన్నికలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను అన్ని ప్రధాన కూడళ్లలోను అంటించి విస్తృత ప్రచారం కల్పించాలని జేసీ సూచించారు. అదే విధంగా ఓటుహక్కు వినియోగం, ఓటు ప్రాధాన్యతపై అన్ని మండలాలలోను ర్యాలీలు నిర్వహించాలన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటి నుంచే ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంటు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు సందర్శించి అక్కడ ఏ విధమైన లోపాలు లేకుండా చూడాలని సూచించారు. ఇప్పటి నుంచే సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు సందర్శించడం వలన ఎన్నికల సమయంలో ఏ విధమైన సమస్యలు ఉత్పన్నం కావని జేసీ అన్నారు. తుపాను ప్రకటన వెలువడినందున తహసీల్దార్లంతా ఆయా మండల కేంద్రాలలో అందుబాటులో అప్రమత్తంగా ఉండి, అవసరమైన సహాయక చర్యల్లో నిమగ్నులై ఉండాలన్నారు. సమావేశంలో ఆర్డీవో బి వెంకటరమణ, రామచంద్రపురం ఆర్డీవో ఎన్ రాజశేఖర్, ముమ్మిడివరం ఈఆర్‌వో వి డేవిడ్‌రాజు, రాజోలు ఈఆర్‌వో ఎన్ మధుసూధనరావు, గన్నవరం మండపేట ఈఆర్‌వో బి శివనారాయణరెడ్డి, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంటు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికార్లు పాల్గొన్నారు.

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జేసీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్ని జిల్లాల కలెక్టరు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జేసీ మల్లికార్జున అమలాపురం ఆర్డీవో కార్యాలయం నుంచి హాజరయ్యారు. సమావేశంలో గ్రామ దర్శిని, వివిధ శాఖల ప్రగతి తదితర అంశాలపై సీఎం వీడియో కాన్ఫరెన్సులో అధికారులతో చర్చించారు.