రాష్ట్రీయం

ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభకు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో అధికారిక పనులు సజావుగా సాగేందుకు అవసరమైన సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో ఇందుకు అనుగుణంగా గురువారం జీఓ (ఎంఎస్ నెంబర్ 159) జారీ అయింది. సీఈఓ కార్యాలయంతో పాటు జిల్లాల్లోని ఎన్నికల అధికారుల వద్ద పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని కేటాయించారు. హైదరాబాద్‌లోని సీఈఓ కార్యాలయంలో ఇద్దరు అసిస్టెంట్ సెక్రటరీలు, ఐదుగురు సెక్షన్ ఆఫీసర్లు, 12 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను కేటాయించారు. సమాచార పౌరసంబంధాల శాఖ నండి ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక ఏపీఆర్‌ఓను కేటాయించారు. మరో 39 మందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించుకునేందుకు సీఈఓకు అవకాశం ఇచ్చారు. ఇలా ఉండగా జిల్లాల్లో పనిచేసేందుకు డిప్యూటీ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఆఫీస్ సబార్డినేట్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు.