రాష్ట్రీయం

తెగని చర్చలు.. తేలని సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో మహాకూటమి ఏర్పాటులో భాగంగా సంబంధిత పార్టీల మధ్య ఎడతెగని చర్చలు కొనసాగుతున్నాయి. ఏయే అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఈ చర్చలు ఎడతెగడం లేదు. టీటీడీపీ నేతలు ముందుగా తమ అసెంబ్లీ స్థానాలను సూచించినా, కాంగ్రెస్ పార్టీ వాటిలో కొన్నింటిని ఆమోదించేలా లేదు. సీపీఐ, జనసమితి సీట్ల వ్యవహారంలో పెద్దగా ఇబ్బంది తలెత్తకున్నా టీడీపీ అసెంబ్లీ సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. టీటీడీపీ నేతలతో చర్చలు ముగిసిన వెంటనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి కాంగ్రెస్ నేతలతో సంభాషించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే రెండు దఫాలుగా సాగిన చర్చలు మరింత ముందుకు సాగాలంటే ముందు అసెంబ్లీల వ్యవహారం తేలాలని చెబుతున్నారు. చంద్రబాబునాయుడు అమెరికా పర్యటకు వెళ్లి ఈ నెల 28న తిరిగి వస్తారు. ఇంకో పక్క తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీల పంచాయితీ మొదలవడంతో ఈ రెండు వ్యవహారాలు కొలిక్కి రావాలంటే కనీసం వారం పది రోజులు పడుతుందని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యేంత వరకూ కాంగ్రెస్ పార్టీ తాము పోటీ చేసే నియోజకవర్గాలను తేల్చరాదని నిర్ణయించింది. అంత వరకూ చర్చల ప్రక్రియనే కొనసాగించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
సీపీఐ, టీడీపీ, జనసమితి పార్టీలకు సీట్ల కేటాయింపులో ఎలాంటి ఇబ్బంది రాదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 90 స్థానాల్లో పోటీచేసే యోచనలో ఉంది, టీడీపీ తమకు 30 అసెంబ్లీలను కేటాయించాలని కోరుతున్నా చివరికి 15 వరకూ అసెంబ్లీలను కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరో పక్క సీపీఐ 15 అసెంబ్లీను కేటాయించాలని కోరినా వారికి మూడు, జనసమితి 30 అసెంబ్లీలను కోరినా, వారికి మూడు లేదా నాలుగు స్థానాలను కేటాయించనున్నట్టు తెలిసింది. ఎంఐఎం ప్రాబల్యం బాగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేసే యోచన లేకపోవడంతో వాటిలో ఎదైనా సీటు కోరితే టీడీపీకి లేదా జనసమితి పార్టీలకు కేటాయించనున్నట్టు
తెలుస్తోంది.
ఎందుకంత ఉలుకు?
మహాకూటమిని దుష్టచతుష్టయమని కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యపై టీటీడీపీ నేతలు మండిపడ్డారు. పోలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం అంతా మహాకూటమిని చూసి ఎలా వణికిపోతున్నారో తెలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో నిజాం కన్నా ఎక్కువగా నిర్బంధ పాలన కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మరో పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ దాష్టీకాలకు గట్టయ్య చనిపోవడానికి ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు. రాజయ్య రోడ్లపైనే ఏడుస్తున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ దుష్టపాలన గురించి ప్రజలకు సంపూర్ణంగా అర్ధమైందని అన్నారు.
బాబు వచ్చే జాబు వచ్చే
నిరుద్యోగుల భవితకు బంగారు బాట వేసేలా 18,450 ఉద్యోగాల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారని , చంద్రబాబురాకతోనే జాబులు వస్తున్నాయని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి పేర్కొన్నారు.