నల్గొండ

కోదాడ టికెట్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, సెప్టెంబర్ 21: కోదాడ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతున్నది. అధిష్ఠానం కోదాడ అభ్యర్థిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నా అధికారికంగా ప్రకటించకపోవడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో అయోమయం కనపడుతున్నది. అటూ పట్టణంలోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం చర్చనీయాంశమైంది. కోదాడ టీఆర్‌ఎస్ టికెట్‌ను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మార్కెట్ చైర్మన్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు ఆశిస్తున్నారు. పార్టీలోని పెద్దలను ప్రసన్నం చేసుకొంటూ తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేసుకొనేందుకు వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ద్వారా శశిధర్‌రెడ్డి కేటీఆర్‌ను కలిసి స్పష్టమైన హామీ తీసుకొన్నట్లుగా టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొని కోదాడ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు గత ఐదేండ్లుగా పడిన కష్టాన్ని అధిష్ఠానం గుర్తించి తనకే టికెట్ ఇస్తుందనే నమ్మకంతో శశిధర్‌రెడ్డి వున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, అన్నివర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగివుండి, కోదాడ నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి నాలుగుసార్లు విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావుకు నేరుగా పార్టీ అధినేత కేసీఆర్‌తో సంబంధాలు వుండటం, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన బడా పారిశ్రామికవేత్త కోదాడ టికెట్ చందర్రావుకే ఇవ్వాలని పట్టుపట్టడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం కేవలం లాంఛనమేనని చందర్రావు మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ నాయకులతోపాటు వివిధ పార్టీల్లోకి వెళ్లిన పాత సహచరులను టికెట్ తనకే కన్ఫర్మ్ అయింది.. గెలిపించేందుకు పనిచేయాలని చందర్రావు ఫోన్‌ల ద్వారా, స్వయంగా కలిసి కోరుతున్నట్లు పలువురు ఆంధ్రభూమికి చెప్పడం ఇక్కడ గమనార్హం. ఈ పరిస్థితిలో అభద్రతాభావానికి గురైన శశిధర్‌రెడ్డి వర్గీయులు కోదాడలో ప్రత్యేక రహస్య సమావేశం నిర్వహించి శశిధర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసి అధిష్ఠానానికి పంపారు. శశిధర్‌రెడ్డి మద్దతుదారులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించి బలప్రదర్శన చేసినంతపనిచేశారు. భారీ బైక్‌ర్యాలీతో బలాన్ని ప్రదర్శించిన శశిధర్‌రెడ్డికి టికెట్ కేటాయించే విషయంపై అధిష్ఠానం పునరాలోచనలో పడిందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఒక దశలో శశిధర్‌రెడ్డి, చందర్రావులు గాకుండా నల్లగొండ ఎంపీ సుఖేందర్‌రెడ్డిని కోదాడ బరి నుండి దింపాలని అధిష్ఠానం చేసిన ఆలోచనను ఆయన తిరస్కరించి చందర్రావును సూచించినట్లుగా ప్రచారం సైతం జరుగుతున్నది. తెలంగాణకు ముఖద్వారంగా వున్న కోదాడ నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో వుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి ఎమ్మెల్యేగా వున్నారు. కోదాడ సీటు ఎలాగైనా ఈ సారి టీఆర్‌ఎస్ ఖాతాలోకి రావాలని పట్టుదలగా వున్న కేసీఆర్ టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేసి గెలిపించేవిధంగా వ్యూహరచన చేసినట్లుగా తెలుస్తున్నది. దానిలో భాగంగానే పార్టీ నాయకుల అందరి సమక్షంలో అభ్యర్థిని ప్రకటించి అందరిని సమన్వయం చేసేందుకు వీలుగా అభ్యర్థి ప్రకటనను ఆలస్యం చేస్తున్నట్లుగా పార్టీవర్గాల ద్వారా తెలుస్తున్నది. దీంతో అధినేత కేసీఆర్ నుండి ఎవరికి పిలుపు, ఎప్పుడు వస్తుందోనని ఆశావహులతోపాటు వారి మద్దతుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వివిద పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీచేసినా సిట్టింగ్ స్థానాలను వదులుకోవద్దని రాహుల్‌గాంధీ చేసిన సూచనమేరకు కోదాడ నుండి మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పేరు ఖరారైనట్లేనని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నారు.