తెలంగాణ

మహాకూటమి అంటే కేసీఆర్‌కు భయం టీడీపీ నేత పెద్దిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: కేసీఆర్ కుటుంబానికి మహాకూటమి భయం పట్టుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు పార్టీ నేతలతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలన చేతకాక తిరిగి ఆశీర్వదించమని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెబుతారేమోనని సభలకు వచ్చిన ప్రజలకు నిరాశ ఎదురవుతోందని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎపుడు ఏం మాట్లాడతారో వారికే తెలియదని, వారు మాట్లాడే తీరు చూస్తే అసహ్యం వేస్తోందని అన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత 50 సభలు పెడతామని అన్నారని ఇంత వరకూ 50 అసమ్మతి సభలు మాత్రమే పూర్తయ్యాయని పేర్కొన్నారు. అసమ్మతి సభ్యులకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒకొక్కరికో అబద్దం చెబుతూ అసమ్మతి సభ్యులను బుజ్జగించే పనిలో ఉన్నారని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను హరీష్‌రావు చూడలేదా అని ఆయన ప్రశ్నించారు. విభజన హామీలపై ఎన్నడూ టీఆర్‌ఎస్ కేంద్రాన్ని నిలదీయలేదని అన్నారు. పార్లమెంటులో ఎన్నడూ పోరాటం చేయలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి రావల్సిన అంశాలపై కూడా మాట్లాడకుండా లాలూచీ ధోరణితో వ్యవహరించిందని అన్నారు.