కృష్ణ

వృత్తి శిక్షణ ద్వారానే స్వయం ఉపాధి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 22: వృత్తి శిక్షణ ద్వారానే నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని శ్రీయాం సంస్థ డైరెక్టర్ సాధినేని కిషోర్ బాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, కాపు కార్పోరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్, సౌత్ ఇండియా ట్రస్ట్ నేతృత్వంలో నిరుద్యోగ యువతీ యువకులకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలను శనివారం కిషోర్ బాబు సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శిక్షణాంశాలను పరిశీలించి శిక్షణ పొందిన యువతీ, యువకులను శిక్షణకు సంబంధించిన అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించటమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని శ్రీయాం సంస్థ ద్వారా తాము నెరవేరుస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ ఇటువంటి అవకాశాలు పట్టణాలకే పరిమితమయ్యాయని, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇటువంటి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తలంచి మైలవరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మైలవరం సెంటర్ పనితీరు బాగుందని కితాబునిచ్చారు. ఇప్పటి వరకూ ఇక్కడ కాపు కార్పోరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు బ్యూటీషియన్ కోర్సు, కుట్టు శిక్షణ కొనసాగుతున్నాయని బ్యూటీషియన్ కోర్సు చివరి దశలో ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తామే ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామన్నారు. ఇవే కాక కొత్తగా సాఫ్ట్‌వేర్ కోర్సులను కూడా ప్రవేశపెట్టటం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కోయ సుధ, విజయలక్ష్మి, అనిల్, మహిళలు, శిక్షకులు పాల్గొన్నారు.

నాలుగు కేసుల్లో బాధితులకు పరిహారం
* కేసుల పురోగతిపై సమీక్షలో జిల్లా న్యాయమూర్తి
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 22: వివిధ కోర్టుల్లో పెండింగ్ క్రిమినల్ కేసుల్లో వారెంట్లు అమలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు సూచించారు. జైళ్లలోని రిమాండు ఖైదీలు, విచారణ ఖైదీల కేసులకు సంబంధించి పురోగతిపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. నగరంలోని కోర్టుల ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో శనివారం జరిగిన ఈ సమావేశానికి కో-ఆర్డినేషన్ కమిటీ (పోలీసు, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన అధికారులు) హాజరయ్యారు. వివిధ కోర్టుల్లో ఇప్పటికే పెండింగ్‌లోని క్రిమినల్ కేసుల్లో వారెంట్లు అమలు జరపడంలో పురోగతిపై చర్చించారు. కేసుల్లో దర్యాప్తు పూర్తయిన మీదట ఛార్జిషీటు త్వరితగతిన దాఖలు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. నాలుగు కేసుల్లో బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి కలెక్టర్ బీ లక్ష్మీకాంతం, పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ట త్రిపాఠి, డీసీపీ బీ రాజకుమారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్ రాజీవ్, ఇతర పోలీసు, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు.