శ్రీకాకుళం

ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ సిద్ధం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌ని పూర్వపు స్థితికి తీసుకొస్తామని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. రాష్ట్ర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచిన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ క్రీడాకారులకు, వాకర్స్‌కు అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో శనివారం ఆర్ట్స్ కళాశాల సిల్వర్‌జూబ్లీ ఆడిటోరియంలో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ కార్యాలయంలో పాల్గొనడానికి వచ్చిన పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్నాయుడ్ని క్రీడాకారులు, వాకర్స్ గ్రౌండ్ లేకపోవడంతో తాము పడుతున్న బాధలను వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కళాశాల మైదానం ఎందుకు పనికి రాకుండా పోయిందని వెంటనే ఈ మైదానం మరమ్మత్తుల పనులను చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. మైదానం పూర్తిగా పాడయినందున వాకర్స్‌కు అనుకూలంగా కావల్సిన వాకర్స్ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయవల్సిందిగా ఆయన తెలిపారు. ఆర్ట్స్‌కాలేజీ మైదానాన్ని పరిశీలించిన వారిలో ఎంపీ రామ్మోహన్నాయుడుతోపాటు జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి, నగరపాలక సంస్థ కమీషనర్ ఆర్.శ్రీరాములునాయుడు, క్రీడాప్రాదికార సంస్థ చీఫ్‌కోచ్ బి.శ్రీనివాసకుమార్ ఉన్నారు.

శతశాతం సబ్సిడీతో చేపపిల్లలు
రేగిడి, సెప్టెంబర్ 22: మండలంలోని ఆమదాలవలస గ్రామానికి చెందిన గిరిజన వ్యక్తి ఎస్.దుర్గారావుకు రూ.36 వేలు విలువ చేసిన చేపపిల్లలు శతశాతం సబ్సిడీతో అందించారు. ఐటీడీ ఏ ఆధ్వర్యంలో వీటిని శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ కిమిడి రామకృష్ణంనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సహకరిస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేపపిల్లలు ద్వారా వచ్చే ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పెంపకంలో మెళకువలు పాటించాలని, ఎటువంటి సమస్యలు ఎదురైనా లబ్ధిదారులు తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాలకు అంబేద్కర్ ఆదర్శంతులు
పాలకొండ (టౌన్), సెప్టెంబర్ 22: అన్ని వర్గాల ప్రజలకు అంబేద్కర్ ఆదర్శంతులని ఎంపీపీ వారాడ లక్ష్మీ అన్నారు. శనివారం మండలంలోని సింగన్నవలస గ్రామంలో దళిత మహిళా శక్తి ఆధ్వర్యంలో చెరువు గట్టుపై అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. ఇటువంటి పరిణామాలు ద్వారా మంచి భవిష్యత్తుతో పాటు సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుందన్నారు. తెలుగు యువత నాయకుడు వారాడ సుమంత్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన జీవితం అంబేద్కర్‌కు నివాళి అన్నారు. ఇటువంటి మహాత్ముని విగ్రహం ఏర్పాటు అన్ని ప్రాంతాల్లో అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మచ్చ వైకుంఠరావు, రాణి, జ్యోతి, రమేష్, మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రత అందరి బాధ్యత
పాలకొండ (టౌన్), సెప్టెంబర్ 22: రోగాలు ప్రబలేందుకు మూల కారణమైన అపరిశుభ్రతను దూరం చేయడం అందరి బాధ్యత అని నగర కమీషనర్ నూకేశ్వరరావు అన్నారు. శనివారం విలేఖర్లతో మాట్లాడుతూ ఇళ్లల్లో ఊడ్చిన చెత్తను రోడ్లుపై, కాలువల్లో వేయవద్దన్నారు. చెత్త సేకరించే వారికి వీటిని అప్పగించాలన్నారు. అక్టోబర్ 2 నుంచి 40 మైకోన్లు కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్ కవర్లను నిషేధించడం జరుగుతుందన్నారు. పన్నులు సకాలంలో చెల్లించి సహకరించాలని కోరారు. పబ్లిక్ కొళాయిలు వినియోగం పూర్తయిన తర్వాత కట్టివేయాలని సూచించారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మోహనరావు
వంగర, సెప్టెంబర్ 22: బీజీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తరావల్లి మోహనరావు నియమించినట్టు శనివారం ఆయన తెలిపారు. బీజేపీలో సీనియర్ నాయకునిగా ఉంటూ సేవలను గుర్తించి పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను శతశాతం న్యాయం జరిగేలా నిర్వహిస్తామన్నారు. ఆయన నియామకం పట్ల నాయకులు చిన్నంనాయుడు, చంద్రశేఖర్, శ్రీను తదితరులు అభినందనలు తెలిపారు.