శ్రీకాకుళం

టీడీపీకి వజ్జ రాకను వైశ్యులు స్వాగతిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, సెప్టెంబర్ 22: తెలుగుదేశం పార్టీలోకి మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబురావు రాకను వైశ్యులంతా స్వాగతిస్తున్నారని టీడీపీ వైశ్యసంఘం నాయకులు టంకాల రవిశంకర్‌గుప్తా, మాల్లా శ్రీనివాసరావు, శాసనపురి మురళీలు అన్నారు. శనివారం పలాసలో వారు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్లులో టీడీపీ ఎంతో అభివృద్ధి చేసిందని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసీ పలాస మున్సిపాలిటీని అభివృద్థి పథంలో నడిపిన మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబురావు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారన్నారని తెలిపారు. వజ్జ రాకతో పలాస మరింత అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి చేసే వ్యక్తులకు టీడీపీ ఎప్పుడూ సముచిత స్థానం కల్పిస్తుందని, వజ్జ టీడీపీలో చేరికను వైశ్యులు వ్యతిరేకిస్తున్న వార్తలు అసత్య ప్రచారమని కొట్టిపారేసారు. టీడీపీ హాయంలోనే వైశ్యులు బీసీలుగా గుర్తించి ఎన్నో సంక్షేమ పథకాలను అందుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ వైశ్యసంఘం నాయకులు మల్లా కృష్ణారావు, మల్లా సూర్యనారాయణగుప్తా, బెల్లాల నారాయణరావు, డోకి రామారావు, జామి రామారావు, బెల్లా ల నాగేశ్వరరావు, పెంట ఉదయశంకర్ తదితరులు పాల్గొన్నారు.

పల్లెల అభివృద్ధి టీడీపీకే సాధ్యం
పలాస, సెప్టెంబర్ 22: పల్లెల అభివృద్ధి టీడీపీకే సాధ్యమని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషా అన్నారు. శనివారం గ్రామవికాసం కార్యక్రమాన్ని కొత్తవూరు, కైజోల తదితర ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు గ్రామాల్లో పర్యటించి స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, పంచాయతీరాజ్ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి పల్లెల్లో సీసీ రోడ్లు, ఎల్ ఇడీ విద్యుత్తు బల్బులు ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. అర్హులందరికి పథకాలు అందించే దిశగా టీడీపీ పనిచేస్తుందని, అర్హత ఉన్నవారందరికి పథకాలు అందించే విధంగా టీడీపీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్, ఎ ఎంసి వైస్‌చైర్మన్ వంకల కూర్మారావు, టీడీపీ నాయకులు డల్లి నర్శింగరావు, కుత్తుం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

రహదారులతోనే అభివృద్ధి సాధ్యం
పలాస, సెప్టెంబర్ 22: ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి పూర్తిస్థాయిలో రవాణా సదుపాయం ఉండాలంటే రహదారులు ప్రధానమని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. శనివారం 16వ వార్డులో 2 లక్షల రూపాయల సాధారణ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. తమ పాలక వర్గం హాయంలో ఎన్నో ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించామని, భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు పూర్తిస్థాయి రహదారి సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. రహదారి పనుల్లో నాణ్యత లోపిస్తే తమకు సమాచారం అందించినట్లైతే దానిపై చర్యలు తీసుకుంటామని, ఇందుకు గాను స్థానికులు తమ ప్రాంతంలో జరిగే అభివృద్ధి పనులపై కనె్నసి ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బోర కృష్ణారావు, ఎస్.సుమన్, బి.శ్రీనివాసరావు, కె.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గణనాధుని నిమజ్జన ఉత్సవాలు
జలుమూరు, సెప్టెంబర్ 22: గత తొమ్మిది రోజులు ఎన్నో పూజలు అందుకున్న గణనాధుడు నవరాత్రి ఉత్సవాలను ముగించుకొని శనివారం సాయంత్రం పల్లెపల్లెల్లో మండపాలనుండి భారీ వాహనాలపై స్వామి అధిరోహించి ఉత్సహంతో నిమజ్జనం కార్యక్రమాలు జరిగాయి. ఇంటింటా స్వామికి మంగళారతులు అందజేసి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. యువకులు ఉత్సాహంతో ఊరేగింపులో పాల్గొన్నారు. మండలం తిలారు రైల్వే స్టేషన్‌లో శనివారం ఆటో యూనియన్ సభ్యులు వినాయకుని సన్నిథిలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చల్లవానిపేటలో ఇందిరానగర్ కాలనీలో యువకులు ఏర్పాటుచేసిన వినాయకుడు, జంక్షన్‌లో ఉన్న గణనాధున్ని ఉత్సాహంగా ఊరేగింపుగా చేపట్టిజలుమూరు వంశధార ప్రధాన కాల్వలో రాత్రి నిమజ్జనం చేపట్టారు.