శ్రీకాకుళం

ఘనంగా పూర్ణాహుతి కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 22: నగరంలోని పాతశ్రీకాకుళం సమీపంలోవున్న అయ్యప్పస్వామి దేవాలయంలో తొమ్మిదిరోజుల పాటు నిర్వహించిన హోమం శనివారం పూర్ణాహుతితో ముగిసింది. రుత్వికులు వి.శ్రీనివాసశర్మ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మిమిక్రీ శ్రీనివాస్, నందికేశ్వరరావు సౌజన్యంతో ఈ తొమ్మిది రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి హోమం ఇందులో ప్రత్యేకత. పూర్ణాహుతి అనంతరం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ఆదిత్యలో జాబ్‌మేళ
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 22: నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్‌లో వున్న కాకినాడ ఆదిత్య కళాశాలలో ఈనెల 24న జాబ్‌మేళ నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ మేనేజర్ ఎన్.గోవిందరావు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల సౌజన్యంతో ఈమేళా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేళాకు సుమారు 15నుంచి 20 బహుళ జాతి కంపెనీలు హాజరవుతున్నాయని తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌మీడియట్, డిగ్రీ, డిప్లమా, బి.టెక్, ఎంబిఏ, ఏదైనా పీజీ చేసిన వాళ్లుకూడా పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 24న ఉదయం 9గంటలనుంచి ప్రారంభమవుతుందని, మరిన్ని వివరాలకు 8074925661 నెంబరుకు సంప్రదించాలని తెలిపారు.

కార్మిక సంక్షేమమే ఈయూ ధ్యేయం
*ఈయూ నెక్‌రీజియిన్ కార్యదర్శి క్రిష్ణమూర్తి
శ్రీకాకుళం(టౌన్),సెప్టెంబర్ 22: ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ఎంప్లాయిస్ యూనియన్ ధ్యేయమని ఆర్టీసీ కార్మికుల కోర్కెల సాధనకు ఎటువంటి పోరాటాలకైనా వెనుకాడమని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్ ఈసీ రీజియన్ కార్యదర్శి బాసూరి కృష్ణమూర్తి పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శనివారం ఎంప్లాయిస్ యూనియన్ తమ కోర్కెల సాధనకు రెండురోజుల ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కోడ్ ఆఫ్ డిసిప్లెయిన్ చక్కగా అమలు చేయాలని, సర్కిలర్ నెంబర్ 33ను రద్దుచేయాలని కోరారు. గ్యారేజీ సిబ్బంది కుదింపునకు సంబంధించి ఎం ఈడీ లేఖ నెంబర్ 3ను రద్దుచేయాలని షెడ్యూల్ 1 మెంటెనెన్స్‌ను పునరుద్ధరించాలన్నారు. డిపోల్లో 12లక్షల కిలోమీటర్లు దాటి సర్వీసుచేసిన బస్సులను నిలుపుచేసి కొత్త బస్సులను ప్రవేశపెట్టాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని పెండింగ్‌లో ఉన్న 5నెలల డి ఏ ఏరియర్‌ను చెల్లించాలన్నారు. అదేవిధంగా కారుణ్య నియామకాలను పునరుద్ధరించాలని, డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో శ్రీకాకుళం 1డిపో కార్యదర్శి ఎస్‌వి రమణ, ఎన్ ఎన్ కుమార్, బి.జయదేవ్, ఎంటివి రావ్, ఎస్‌వి రావ్, శ్రీకాకుళం 2 డిపో అధ్యక్ష, కార్యదర్శులు బి. ఆర్ కృష్ణ, కె.బాబూరావు, డి ఆర్ గోపాల్, విటి రాజు, కె.గణేశ్వరరావు, ఎస్ ఎస్ శర్మ, గ్యారేజీ సిబ్బంది పాల్గొన్నారు.

దైవ కార్యక్రమాలలో యువత పాత్ర హర్షనీయం
* ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి
శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: దైవ కార్యక్రమాల్లో యువత పాల్గొనడం ఎంతో హర్షనీయమని స్థానిక శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి కొనియాడారు. స్థానిక సున్నపువీధిలో వినాయక నవరాత్రుల సందర్భంగా శనివారం మహా అన్నధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా గర్వించదగ్గ విషయమాన్నారు. భగవద్భక్తి అందరికి ఎంతో అవసరమని అన్నదానాన్ని మించిన మహాదానం మరొకటి లేదని ఆమె అన్నారు. 14వ డివిజన్ వార్డ్ ఇన్‌ఛార్జ్ నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేశ్, ఇప్పిలి తిరుమలరావు, చిట్టినాగభూషణం, కరగాన రాము, రమేష్, ప్రసాద్, యుగందర్, యాకూబ్, జ్యోతిప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.

రైతు బజార్‌లో నిలిచిపోయిన నీరు
* వినియోగదారులు అవస్థ
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 22: జిల్లా కేంద్రంలో ఇల్సిపురం సమీపంలో ఉన్న రైతుబజార్‌లో వర్షపు నీరు నిలిచిపోవడంతో అటు రైతులు, వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీరు పోయేందుకు కాల్వలు ఏర్పాటు చేసినప్పటికి నిర్వహణ లేకపోవడంతో భారీ వర్షం పడితే నీరు నిలిచిపోతుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. నిధులు మంజూరై ఏవో పనులు చేసినప్పుడు తప్ప సాధారణంగా కాల్వల నిర్వహణ చేపట్టడం లేదు. నగరంలో కార్పొరేషన్ పరిథిలో ఉన్న కాల్వల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. రైతు బజార్ సమీపంలోని కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో వర్షపు నీరు ప్రవాహానికి ఆటంకం ఏర్పడంతో రైతుబజార్‌లో నీరు నిలిచిపోయింది. ఆకుకూరలు తదితర విక్రయాలు కొనసాగించేందుకు ఆటకం ఏర్పడింది.