జాతీయ వార్తలు

పారికర్‌ను తప్పించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, సెప్టెంబర్ 23: గోవా ముఖ్యమంత్రిగా మరోహర్ పారికర్‌ను తొలగించే ప్రసక్తే లేదని, ఆయన ఆ పదవిలో కొనసాగుతారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారంనాడు ఇక్కడ స్పష్టం చేశారు. అయితే, త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని గోవాకు చెందిన పార్టీ కీలక బృందంతో జరిపిన చర్చల సందర్భంగా వెల్లడించారు. గోవా ముఖ్యమంత్రి పదవి నుంచి పారికర్‌ను తప్పించాలని, మైనారిటీలో పడ్డ ఆయన ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణంగా చికిత్స పొందుతున్న పారికర్‌ను తప్పిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో అమిత్‌షా ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, అసమ్మతిని తొలగించడానికి వీలుగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణను త్వరలోనే చేపడతామని, ఇందులో భాగంగా మంత్రులను, వారి పోర్టుపోలియోలను కూడా మారుస్తామని వెల్లడించారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్న పారికర్‌ను కొనసాగిస్తారా? లేదా అన్న అంశం ప్రశ్నార్థకంగా మారడంతో దీనిపై అనేక ఊహాగానాలు చెలరేగాయి. పెరిగిపోతున్న అసమ్మతిని బుజ్జగించేందుకు అలాగే అధికారాన్ని పంచుకుంటున్న మిత్రపక్షాల్లోనూ ఆందోళలను తొలగించేందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర బృందాన్ని పంపారు. వారి ద్వారా గోవా తాజా రాజకీయ పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ఈ తాజా సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు క్రమంగా పావులు కదుపుతోంది. అయితే, కాంగ్రెస్ చర్యలకు ఎప్పటికప్పుడు గండికొడుతున్న బీజేపీ నాయకత్వం అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని స్పష్టం చేసింది. 40 మంది సభ్యులు కలిగిన రాష్ట్ర అసెంబ్లీలో పారికర్ ప్రభుత్వానికి 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వీరిలో 14 మంది బీజేపీ సభ్యులు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో 16 మంది సభ్యులున్నారు.
పారికర్ చేతిలో రాఫెల్ గుట్టు
దమ్ముంటే గోవా ముఖ్యమంత్రి పారికర్ చేత రాజీనామా చేయించాలని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రధాన నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను డిమాండ్ చేసింది. పారికర్‌ను రాజీనామా చేయాలని కోరితే రాఫెల్ కుంభకోణం గుట్టును ఎక్కడ రట్టు చేస్తారనే భయం వీరికి ఉందని, అందుకే ఆయనను అనారోగ్యంతో ఉన్నా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం లేదని కాంగ్రెస్ గోవా కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోదాంకర్ అన్నారు. రాఫెల్ వ్యవహరం గురించి పారికర్‌కు లోతైన సమాచారం తెలుసునని, ఆయన రక్షణ మంత్రిగా ఉన్నపుడే ఈ డీల్ కుదిరిందని కాంగ్రెస్ నేత అన్నారు.