బిజినెస్

అవసరమైతే తగిన చర్యలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 23: ఫైనాన్సియల్ మార్కెట్లలో కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు, అవసరమయితే తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదివారం ప్రకటించాయి. శుక్రవారం ఈక్విటీ, డెబిట్ మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో ఈ ప్రకటనలు వెలువడ్డాయి.
సోమవారం మార్కెట్లలో తీవ్ర స్థాయిలో ఊగిసలాట చోటు చేసుకుంటుందనే భయాందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ రెండు నియంత్రణ సంస్థలు ఆదివారం వేర్వేరుగానే అయినా ఒకేలా స్పందించాయి. వివిధ రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ తీసుకున్న రుణాలను చెల్లించలేని స్థితికి దిగజారిన నేపథ్యంలో దేశంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) స్థితిపై కూడా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం విస్తృత స్థాయిలో జరిగిన లావాదేవీల వివరాలు ఇవ్వాలని సెబీ ఇప్పటికే స్టాక్ ఎక్స్చేంజీలను ఆదేశించిందని, మార్కెట్‌లో తీవ్ర స్థాయిలో ఊగిసలాటను నిరోధించడానికి చర్యలు తీసుకోవడానికి సిద్ధమయిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.