ఆంధ్రప్రదేశ్‌

పీడీ అకౌంట్స్‌పై కోర్టుకెళ్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో 53వేల కోట్ల రూపాయలను పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ ద్వారా దారి మళ్లించారని, దీనిపై సీబీఐ విచారణ కోరేందుకు కోర్టును ఆశ్రయిస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పీడీ ఎకౌంట్స్ ద్వారా నిధులు దారి మళ్లాయని ఆరోపించారు. ఆదివారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో పార్టీ పార్లమెంటరీ స్థాయి సమావేశానికి వచ్చిన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ అకౌంట్స్‌కు సంబంధించిన వివరాలను సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నిధులకు సంబంధించిన బిల్లులు లేవని, ఖర్చుల వివరాలు చెప్పరని మండిపడ్డారు. ఇందులో భారీ స్థాయిలో దోపిడీ జరిగిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు, సీబీఐకి సమాధానం చెప్పాలన్నారు. పీడీ అకౌంట్స్‌పై సీబీఐ విచారణ జరగాలని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ఇందుకు ముందుకు రావాలని సవాల్ విసిరారు.
విప్లవాత్మక పథకం ‘ఆయుష్మాన్ భారత్’
దేశ వైద్య చరిత్రలో ‘ఆయుష్మాన్ భారత్’ పథకం విప్లవాత్మకమైన మార్పు తేనుందని జీవీఎల్ అన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం 50కోట్ల మంది పేదలకు ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల భద్రత విషయంలో ప్రధాని మోదీ ఎప్పుడూ రాజీపడరని చెప్పారు. ఇక్కడ రాష్ట్రంలో మాత్రం జన్మభూమి కమిటీల ద్వారా ప్రతి స్కీమ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్కాంలా మారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని దాదాపు 2లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేలా చేశారని మండిపడ్డారు. నీరు-చెట్టు పథకంలో వేలాది కోట్ల రూపాయలను టీడీపీ నాయకులు తమ జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. ఇన్ని కుంభకోణాలకు పాల్పడుతూ కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని చంద్రబాబు అంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు కాంట్రాక్టర్లు చేస్తున్నారా? తెలుగుదేశం ప్రభుత్వం చేస్తోందా? అని ప్రశ్నించారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక ప్రైవేట్ సంస్థ అని, ఆ సంస్థ ఆహ్వానం పంపిందని చెప్పడం తెలుగుదేశం నాయకుల అబద్ధ ప్రచారమన్నారు. చంద్రబాబు తనయుడిని రాజకీయంగా పరిచయం చేయడం కోసమే ఈ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నరసరావుపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు బీజేపీ సహకారం అందిస్తుందని జీవీఎల్ వివరించారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ జీవీఎల్