కర్నూల్

బాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, సెప్టెంబర్ 24:గత ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాడని, అయితే ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో లేరని ఎమ్మెల్యే ఐజయ్య పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 3వేల కి.మీ పూర్తి చేస్తుకున్న సందర్భంగా సోమవారం పట్టణంలో వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే ఐజయ్యతో పాటు బైరెడ్డి మల్లికార్జునరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో టీడీపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందన్నారు. బ్యాంకుల్లో రుణాలు మాఫీ అవుతాయని భావించిన రైతులు బ్యాంకుల వద్దకు వెళ్తే వడ్డీలు విపరీతంగా పెరగడాన్ని చూసి కుదేలయ్యారన్నారు. అప్పులు చెల్లించాలని బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారని, దీంతో కడుపు మండిన రైతాంగం ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. టీడీపీకి తగిన బుద్ధి చెబుదామా అంటూ ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు ప్రత్యేకహోదాను సైతం రాజకీయం చేస్తూ ప్రజల సొమ్ముతో యాత్రలు చేయడం విడ్డూరంగా వుందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఐజయ్య ధీమా వ్యక్తం చేశారు.
రైతాంగాన్ని ఆదుకోవడంలో
ప్రభుత్వం విఫలం
* రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిష్టయ్య
మిడుతూరు, సెప్టెంబర్ 24:ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిష్టయ్య ఆరోపించారు. స్థానిక శ్రీచెన్నకేశవస్వామి దేవాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వేసిన పంటలు వేసినట్లే వున్నాయని, కనీసం పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితులు లేవన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరవు నెలకొన్నా, కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షం కురిసిందని పేర్కొంటూ ప్రభుత్వం కొన్ని మండలాలను మాత్రమే కరవు ప్రాంతాలుగా ప్రకటించడం అన్యాయమన్నారు. రాష్టవ్య్రాప్తంగా కరవును అంచనా వేసేందుకు రైతు సంఘం తరఫున 3 కమిటీలు సర్వే చేస్తున్నాయని, ఇందులో భాగంగా తాము ఈ ప్రాంతంలో కరవు అంచనా వేస్తున్నామన్నారు. సర్వే పూర్తి కాగానే తిరుపతిలో జరిగే సమావేశంలో అన్ని ప్రాంతాల కరవు నివేదికను తయారు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.