చిత్తూరు

సమాజంలో మార్పు తెండి, మహిళలకు భరోసా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 25: సమాజంలో మార్పు తెచ్చి మహిళలకు భరోసా కల్పించే విధంగా మహిళా పోలీసులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ రాజశేఖ్‌ర్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహిళా పోలీసు సిబ్బందితో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంరక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని , వీటిపై మహిళా పోలీసులు తరోగా ఉంటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేడు మహిళల కోసం అనేక చట్టాలు ఉన్నా వాటిపై అనేక మందికి సరైన అవగాహన లేక పోతుందన్నారు. మహిళా చట్టాలపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. మహిళా ఆత్యహత్యల నిరవాణకు కృషి చేసి వారికి సరైన సూజనలు సలహాలు ఇచ్చి కౌన్సిలింగ్ ద్వారా వారిలో మార్పు తీసుకురావాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పలు సమావేశాలు ఏర్పాటుచేసి ఆత్మహత్యల నివారణపై చైతన్య పరచాలన్నారు. 18 పూరె్తైన నిండని అమ్మాయిలతో ప్రేమ పెళ్లి కాని, శారీక సంబంధాలు చట్టరీత్యా నేరన్న విషయాన్ని అందరికి తెలపాలన్నారు. తమపై జరుగుతున్న లైంగిక దాడులపై వౌనంగా వీడి పోలీసులను ఆశ్రయించే విధంగా బాధితులను ప్రోత్సహించాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళల పట్ల సిబ్బంది సానుభూతితో పాటు గౌరవంగా మెలగాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కాలేజిలు, స్కూల్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను సరైన మార్గంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రేమ పేరుతో తప్పు చేసి ముఖం చాటేసి వాళ్ళ భరతం పట్టాలని ఆదేశించారు. మహిళపై జరుగుతున్న వివిధ నేరాల గురించి చట్టాలపై, అవగాహన కల్పిచండతోపాటు సమాజంలో మార్పు కోసం సైనికుల్లా పని చేయాలన్నారు. ఈవిషయంలో పలు మహిళా సంఘాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలో మహిళల భద్రతకు మీమున్నామన్న భరోసా కల్పించే విధంగా విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ సుప్రజ, మిహిళా డీఎస్పీ నారాయణ స్వామి డీ ఎస్పీలు సుబ్బారావు, మురళి, పలువురు సిఐలు ఇతర మహిళా సిబ్బంది పాల్గొన్నారు.