చిత్తూరు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరింత విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 25: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో మంగళవారం అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ విలేఖరులతో మాట్లాడుతూ అక్టోబర్ 10 నుండి 18వతేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు, తమిళులకు ముఖ్యమైన పెరటాశి నెల సందర్భంగా స్వామివారి దర్శనానికి అత్యధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 6, 7, 13, 14, 20, 21వ తేదీల్లో వచ్చే శని, ఆదివారాల్లో ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పించబడతాయని, సిఫార్సు లెటర్లపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేశామన్నారు. సెప్టెంబర్ 29, అక్టోబర్ 6, 13, 20వ తేదీల్లో వచ్చే శనివారాల్లో దివ్యదర్శనం టోకెన్లు నిలిపివేస్తున్నామన్నారు. అదే విధంగా అక్టోబర్ 14వ తేదీ ఆదివారం శ్రీవారి గరుడసేవ సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు జారీ చేయబడవని తెలియజేశారు. గరుడసేవ తరువాత భక్తుల రద్దీ దృష్ట్యా పరిమిత సంఖ్యలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు జారీ చేయనున్నామన్నారు. సర్వదర్శనం భక్తులకు క్యూలైన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా లేపాక్షి సర్కిల్ నుండి ఆళ్వార్ ట్యాంకు, నారాయణగిరి ఉద్యానవనాల వరకు ఉన్న క్యూలైన్లు, ముల్లగుంటలో నూతన క్యూలైన్లను ఏర్పాటు చేసి, క్రమపద్ధతిలో దర్శనానికి అనుమతించనున్నామని తెలిపారు.
శ్రీవారి ఆర్జితసేవల లక్కీడీప్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదు
శ్రీవారి ఆర్జితసేవలకు సంబంధించిన లక్కీడీప్‌లో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని, ఇందుకోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి లోపాలు లేవని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. ఇప్పటివరకు సేవా టికెట్లు పొందే భక్తుల ఫొటోలు, ఆధార్‌కార్డును అప్‌లోడ్ చేసేవారని, భక్తుల సౌకర్యార్థం సరళీకృతం చేయడంలో భాగంగా వీటిని తీసివేశామన్నారు. లక్కీడీప్ విధానంలో కొందరు అక్రమార్కులు డబ్బులు సంపాదించాలని దురాశతో నకిలీ ఐడీ కార్డులతో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. భక్తులు ఎలాగైనా స్వామివారిని దర్శించుకోవాలనే కోరికతో అధికమొత్తంలో డబ్బులను అక్రమార్కులకు చెల్లిస్తున్నారన్నారు. అటువంటి వారిపై టీటీడీ నిఘా విభాగం, పోలీసు విభాగాలు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. టీటీడీ అధికారులు త్వరలో దీనిపై సమగ్ర నివేదికను టీటీడీ ఈఓకు అందివ్వనున్నామన్నారు. టీటీడీ శ్రీవారి భక్తులకు పారదర్శకమైన సేవలందిస్తున్నదని, భక్తులు కూడా అంతే పారదర్శకంగా సేవలు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి సీవిఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, ఎస్వీబీసీ సీఈఓ నగేష్, ఎస్‌ఈ2 రామచంద్రారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఆరోగ్యవిభాగాధికారిణి డాక్టర్ శర్మిష్ట, ఇతర అధికారులు పాల్గొన్నారు.