గుంటూరు

ప్రపంచ పోటీలకు సాంబశివరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (స్పోర్ట్స్), సెప్టెంబర్ 25: ఐర్లాండ్‌లో ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్న ప్రపంచ మోడరన్ పెంటాథ్లెన్ లేజర్ రన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు శిక్షకుడుగా గుంటూరు నగరానికి చెందిన గమిడి సాంబశివరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె కృష్ణయ్య, గమిడి సాంబశివరావు నియామకాన్ని ధ్రువీకరించారు. విజయవాడలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సాంబశివరావు గతంలో కామనె్వల్త్ గేమ్స్, ప్రపంచ మిలటరీ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. రాష్ట్ర పోలీసు జట్టుకు అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇస్తున్న సాంబశివరావు 2017లో డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు రాష్ట్ర పోలీసు జట్టు శిక్షకుడిగా వ్యవహరించి విజయాలను చేకూర్చారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్‌టిఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శి, కోశాధికారి దామచర్ల శ్రీనివాసరావు, టి సంపత్‌కుమార్, అథ్లెటిక్స్ సంఘ కార్యదర్శి జి శేషయ్య, సాయిదీప్తి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ నర్రా శ్రీనివాసరావు, ఎన్‌టిఆర్ స్టేడియం అథ్లెటిక్స్, టెన్నిస్ శిక్షకులు భాష్యం రామకృష్ణ, జివిఎస్ ప్రసాద్‌లు సాంబశివరావును పుష్పగుచ్చంతో అభినందించారు.

జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు
గుంటూరు (స్పోర్ట్స్), సెప్టెంబర్ 25: అక్టోబర్ 2 నుండి 7వ తేదీ వరకు గుంటూరు ఎన్‌టిఆర్ స్టేడియంలో ఆలిండియా సబ్ జూనియర్ అండర్-13 ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపి బ్యాడ్మింటన్ సంఘ వైస్ ప్రెసిడెంట్ రాయపాటి రంగారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రముఖ క్రీడాకారులు తలపడనున్నారని అక్టోబర్ 2,3 తేదీల్లో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయని, 4వ తేదీ నుండి మెయిన్ డ్రా పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలిండియా బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శి పున్నయ్య చౌదరి మాట్లాడుతూ ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేసి శిక్షణ అందిస్తారన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, ఎ రమేష్, ఎంవి సురేష్, సంపత్‌కుమార్, కాశీ, హరికృష్ణ, బి రాము, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోటీలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.