గుంటూరు

నయనానందకరం.. *ఆదికేశవుని పున్నమి గరుడోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, సెప్టెంబర్ 25: ఆశ్రీతజన బాంధవుడైన ఆదికేశవ స్వామి పున్నమి గరుడోత్సవం మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామంలో మంగళవారం రాత్రి నయనానందకరంగా జరిగింది. కాకతీయ గణపతి దేవుని బావమరిది అయిన జాయపసేనాని నిర్మించిన శ్రీ భూ నీలా సమేత ఆదికేశవ స్వామి ఆలయం వద్ద నుంచి బయలుదేరిన ఈ గరుడసేవ ప్రధాన వీధుల్లో సాగింది. ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఫణిహారం శ్రీ్ధర్ నేతృత్వంలో జరిగిన ఈ గరుడోత్సవంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. తిరుమల తిరుపతిలో జరిగే గరుడోత్సవం మాదిరిగానే ఇక్కడ కూడా గరుడసేవ నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది.
విద్యాసంస్థల బంద్ విజయవంతం
పొన్నూరు, సెప్టెంబర్ 25: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని గర్హిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ పిలుపుమేరకు రాష్టవ్య్రాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా పొ న్నూరులోని విద్యాసంస్థలు మంగళవారం మూతపడ్డాయి. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల నుండి భారీస్థాయిలో జరుగుతున్న ఫీజుల వసూళ్లను నియంత్రించేందుకు చట్టం చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన బంద్ సందర్భంగా ఇక్కడి విద్యాసంస్థల నిర్వాహకులు స్వచ్చంధంగా పాఠశాలలను మూసివేసి బంద్‌కు సహకరించారు.