కర్నూల్

ఘనంగా సీమోళ్లంఘన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, సెప్టెంబర్ 25: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు చేపట్టిన 41రోజులు పాటు చేపట్టిన చాతుర్మాస దీక్షలో భాగంగా సీమోలంగణ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం చాతుర్మాస దీక్ష ముగింపు సందర్భంగా పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ముందుగా శ్రీ మూలరామ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. శ్రీమఠంలో ఏర్పాటు చేసిన భాగవత మంగళ మహోత్సవం సందర్భంగా పీఠాధిపతి శ్రీలక్ష్మీనరసింహస్వామి చిత్రపటానికి పూజలు చేసి, పండితులను ఘనంగా సన్మానించారు. చాతుర్మాస దీక్ష విరమణ సందర్భంగా సీమోలంగణ పురస్కరించుకుని పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులను సాయంత్రం శ్రీమఠం దగ్గర నుంచి ప్రధాన ద్వారం వరకు పల్లకిలో ఊరేగించారు. అక్కడి నుంచి కొండాపురం చేరుకుని, శ్రీ ఆంజనేయ స్వామికి నిర్మల్య అభిషేకం, ఆకుపూజ తదితర ప్రత్యేక పూజలు చేసి చాతుర్మాస దీక్షకు విరమణ పలికారు. అక్కడి నుంచి వివిజ అతిధిగృహం దగ్గరకు చేరుకున్న పీఠాధిపతులను ప్రత్యేక వాహనంలో కూర్చోబెట్టి మఠం అధికారులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్థులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అక్కడి నుంచి మహిళాభక్తుల కీర్తనలు, కోలాటాలు, నృత్యాలు, డోళ్లు, సన్నాయి మేళాల మధ్య బాణసంచా కాలుస్తూ రాఘవేంద్ర కూడలి మీదుగా ఊరేగిస్తూ శ్రీమఠం చేరుకున్నారు.
రాఘవేంద్రుని సన్నిధిలో కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే కుటుంబ సమేతంగా వచ్చారు. వారికి మఠం సహాయ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ఘనంగా స్వాగతం పలికారు. వారు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని, శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించకుని మొక్కులు తీర్చుకున్నారు. అంతక ముందు పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థుల సీమోల్లంగన కార్యక్రమంలో భాంగంగా చాతుర్మాస దీక్ష ముగింపు పురస్కరించకుని ప్రత్యేక వహనంలో ఊరేగింపు జరగుతున్న తరుణంలో కేంద్ర మంత్రి పీఠాధిపతికి పూలమాలవేసి ఆశీర్వాదం పొందారు.