క్రీడాభూమి

టెస్ట్ క్రికెట్ స్వరూపాన్ని మార్చొద్దు: కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: టెస్ట్ క్రికెట్ స్వరూపాన్ని మార్చాలని చూడటం మంచిది కాదని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ మ్యాచ్‌ను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలన్న ఆలోచనను ఆయన విభేదించాడు. సంప్రదాయబద్ధమైన ఫార్మట్‌ను మార్చడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా స్పందించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన కోహ్లీ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ టెస్ట్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసిన చేసినపుడు కలిగే సంతృప్తిని వర్ణింపనలవికాదన్నాడు. టెస్ట్ క్రికెట్ అనేది ప్రతి క్రికెటర్‌కూ అద్భుతమైన ఫార్మట్ అని, అది ఉనికి కోల్పోతుందని, రాబోయే రోజుల్లో నాలుగు రోజులకు కుదించబడుతుందని తాను అనుకోవడం లేదని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న టీ 20 లీగ్ మ్యాచ్‌ల ట్రెండ్ టెస్ట్ మ్యాచ్‌లతో బాటు వన్‌డే మ్యాచ్‌ల ఉనికికి ప్రశ్నార్థకంగా పరిణమించిందనడం సరికాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అలా కొన్ని దేశాల్లో ఉండచ్చేమో కానీ ప్రజల్లోవున్న క్రీడాసక్తిని అనుసరించి ఆ పరిస్థితి మారుతుందన్నాడు.