నిజామాబాద్

సుదర్శన్‌రెడ్డి ఇంటింటి ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, సెప్టెంబర్ 25: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తొలిసారి ఎడపల్లి మండలానికి విచ్చేసిన మాజీ మంత్రికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండలంలోని నెహ్రునగర్ నుండి భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ముందుగా నెహ్రునగర్ గ్రామంలో ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్‌రెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించగా, వారిని ఉద్దేశించి మాట్లాడారు. అక్కడి నుండి ర్యాలీగా జానకంపేట్‌కు చేరుకోగా, అశోక్‌సాగర్ చెరువు కట్టపై నిజామాబాద్-బోధన్ రహదారిపై గల హజ్రత్ సయ్యద్ మీర్ తాహెర్ అలీషా దర్గాలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి చాదర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జానకంపేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, మహనీయుల చౌరస్తా(గాంధీ,అంబేద్కర్)లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి ప్రజలను నమ్మించి ఓట్లు దండుకుని అధికారంలోకి రావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తయినా, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేసిన పాపానపోలేదని ఆరోపించారు. ముఖ్యంగా పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ముస్లింలకు, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం, మహిళా సంఘాల సభ్యులకు 10లక్షల వరకు రుణ సౌకర్యం వంటి అనేక హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, లక్ష రూపాయల రుణమాఫీని విడదల వారిగా చేయడంతో ఆ మొత్తం బ్యాంకుల్లో వడ్డీలకే సరిపోలేదన్నారు. ఎన్నికల నాటికి ఇంటింటికి మిషన్ భగీరథ జలాలను అందించకుంటే ఓట్లు అడుగమని పేర్కొన్న సీఎం కేసీఆర్, ప్రస్తుతం ఏ గ్రామానికి నీళ్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనందున ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుండటంతోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల డ్రామాకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. ఎన్నికల హామీలను విస్మరించి, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కావాలని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు.