మహబూబ్‌నగర్

మహాకూటమితో తెరాసను మట్టి కరిపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, సెప్టెంబర్ 25: త్వరలో జరుగునున్న ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో తెరాసని మహాకూటమితో మట్టికరిపిస్తామని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌డ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాస పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబాటు తనాన్ని చెవిచూసిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాల అమలులో చరిత్ర సృష్టించారని చెప్పుకొస్తున్న మంత్రులు, ఆపార్టీ ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నప్పటికి పథకాల అమలు ఏమో తెలియదుకానీ సెక్రెటరియేట్‌కు రాని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రపంచ చరిత్ర సృష్టించారని అన్నారు. ఒక ముఖ్యమంత్రి తన విధులకు దూరంగా ఉండటం శోచనీయమని అన్నారు. హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేయలేదని అన్నారు. తెరాస పాలన తెలంగాణకు పట్టిన శని అన్నారు. అందుకే కెసిఆర్ పాలన నుండి కాపాడుకునేందుకే తెదేపా, కాంగ్రెస్, టీజేఎస్, సిపిఎం తదితర పార్టీలతో కలసి ఈ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి తెరాసను మట్టికరిపిస్తామన్నారు.
మక్తల్‌లో మహాకూటమి తరపున టికెట్ ఎవరికి చవ్చిన అందరం కలసి కట్టుగా ఉంటూ కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటామని దయాకర్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. కమీషన్ కాకతీయ పథకం అవినీతి మయంగా మారిందని అన్నారు. మక్తల్ పెద్ద చెరువే నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరందిస్తామని నీళ్లివకపోతే ఓట్లు అడుగమని చెప్పి నేడు ఎక్కడ కూడా నల్లాల ద్వారా నీటి చుక్కను ఇవ్వలేదని మండి పడ్డారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈనెల 30న ఊట్కూర్, వచ్చేనెల 4న మక్తల్, మండలాల తెదేప నాయకుల, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు దయాకర్‌రెడ్డి తెలిపారు. ఆట్టి సమావేశాల్లో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళుతామని అన్నారు. ఏది ఏమైనప్పటికి ముందస్తు ఎన్నికల్లో తెరాసను మట్టి కరిపించడం ఖాయమని అన్నారు. సమావేశంలో మాజీ ఎంపిపి చంద్రకాంత్‌గౌడ్, గీతాకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌గౌడ్, తెదేపా నాయకులు జగదబిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రమేష్‌రావు, అస్గర్‌అలీ, విశ్వనాథ్, బండారి భీమేష్, వలీ పాల్గొన్నారు.