మహబూబ్‌నగర్

కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 25: కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మోద్దని వారి జిమ్మిక్కులు ఇక చెల్లవంటూ మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ జితేందర్‌రెడ్డి, కొడంగల్ తెరాస అభ్యర్థి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిలు అన్నారు. మంగళవారం మద్దూర్ మండలంలో కొడంగల్ తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి మద్దతుగా దోరేపల్లి గ్రామసమీపంలో గల శ్రీ అంజనేయస్వామి దేవాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డిలతో పాటు అభ్యర్థి నరేందర్‌రెడ్డి సైతం ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దోరేపల్లి గ్రామం నుండి ప్రారంభమైన మోటర్‌సైకిల్ ర్యాలీ మద్దూర్‌కు చేరుకుంది. రూ.60లక్షల వ్యయంతో నిర్మించబోయే మద్దూర్ బస్టాండ్, సిసిరోడ్ల నిర్మాణానికి మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిలు శంకుస్థాపన చేశారు. అనంతరం మద్దూర్ పాతబస్టాండ్ చౌరస్తాలో ఎన్నికల ప్రచార సభ రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ పనిచేయాల్సి వస్తే ఢిల్లీ నాయకుల కాళ్లు పట్టుకుని వెంపర్లు అడే పని ఉంటుందని ఆరోపించారు. అదే టీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో స్వయం పరిపాలన, స్వాభిమానంతో ఎవరి కాళ్లు పట్టుకోకుండా అభివృద్ధి చేసుకోవాల్సిన అవకాశం ఉంటుందన్నారు. మద్దూర్ మండల ప్రజలు ఇవి ఎంలపై కారు గుర్తుకు ఓటు వేసి పట్నం నరేందర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దొంగజపం, జిమ్మిక్కులు చేసే కాంగ్రెస్ నాయకులను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. తెరాస అభ్యర్థి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది తెలంగాణ ఏర్పడ్డాక, ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యాకనే చోటు చేసుకుందన్నారు. కేవలం పంచాయతీరాజ్ రోడ్లకు రూ.300కోట్లు కేటాయించిన ఘనత టీ ఆర్ ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. తొమ్మిదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన రేవంత్‌రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండకుండా, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే హైదరాబాద్‌లో ఉంటూ భూదందాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. తాను ఈ వేదిక నుండి టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఓ భరోసాను ఇస్తున్నానని గ్రామాల్లో రేవంత్‌రెడ్డికి భయపడాల్సిన అవసరంలేదని ఒకవేళ రేవంత్‌రెడ్డి గాని, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి గానీ టీఆర్‌ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తే తిరగబడాలని పిలుపునిచ్చారు. ఇక రేవంత్‌రెడ్డి ఆటలు, జిమ్మిక్కులు సాగవని, ఆయన ఓటమి ఖాయమని కొడంగల్‌లో గులాబీ జెండా గుభాళించడం తథ్యమని కార్యకర్తలంతా ధైర్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బాల్‌సింగ్‌నాయక్, సలీం, వీరేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.