రాష్ట్రీయం

కిడారి హత్య వెనుక కుట్ర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్ట్‌లు పగడ్బందీ వ్యూహంతో మట్టుపెట్టడం వెనుక కుట్రలేమైనా దాగి ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసు రక్షణ లేకుండా కిడారి గ్రామదర్శిని కార్యక్రమానికి ఎందుకు బయల్దేరారు? ఎమ్మెల్యే సహా పలువురు నాయకులు డుంబ్రిగుడకు వస్తున్న సమాచారాన్ని మావోయిస్ట్‌లకు ఎలా చేరింది? గూడ క్వారీ మూయకపోతే ప్రాణాలు పోతాయని తెలిసినా కిడారి ఆ క్వారీని ఎందుకు మూయలేదు? అన్నింటికీ మించి ఆదివారం నాటి గ్రామదర్శిని కార్యక్రమానికి కిడారిని బలవంతంగా తీసుకువెళ్లారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్ట్‌లు హతమార్చడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

పోలీసు బందోబస్త్ ఎందుకు ఇవ్వలేదు?
మావోయిస్ట్ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులెవ్వరినీ స్టేషన్ వదిలి బయటకు రావొద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందులో భాగంగానే కిడారికి పోలీస్ బందోబస్త్ ఇవ్వలేదా? డుంబ్రిగుడ పర్యటనకు వెళ్లే ముందు సర్వేశ్వరరావుకు పోలీస్ బందోబస్త్ కావాలని ఆయన వ్యక్తిగత కార్యదర్శి డుంబ్రిగుడ ఎస్‌ఐను ఫోన్‌లో కోరినట్టు చెపుతున్నారు. మావోయిస్ట్‌ల వారోత్సవాల కారణంగా తాము రాలేమని ఎస్‌ఐ చెప్పారా? ఆయన చెప్పినా వినిపించుకోకుండా సర్వేశ్వరరావు గ్రామదర్శినికి బయల్దేరి వెళ్లారా? అనే విషయం ఇంకా గోప్యంగా ఉంది. దీనిపై కిడారి వ్యక్తిగత కార్యదర్శిని విచారిస్తున్నారు.

ప్రత్యర్థుల పథకం?
సర్వేశ్వరరావుకు నియోజకవర్గంలో స్వపక్షీయుల్లోనే శత్రువులు ఉన్నట్టు సమాచారం. అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నాలుగు మండలాల్లో మావోయిస్ట్‌ల ప్రాబల్యం ఉంది. ఇందులో డుంబ్రిగుడ కూడా ఉన్నట్టు చెపుతున్నారు. కిడారిని ఆదివారం గ్రామదర్శిని కార్యక్రమానికి రావల్సిందిగా కొంతమంది కొద్దిరోజుల ముందు నుంచి పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయని కూడా చెపుతున్నారు. గ్రామదర్శినికి రావాలని కిడారిపై వత్తిడి తెచ్చింది ఎవరు? కొంతమంది రాజకీయ నాయకులే కిడారి కార్యక్రమానికి ముందుగా మావోలకు లీక్ చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డుంబ్రిగుడలో జరిగే గ్రామదర్శిని కార్యక్రమం గురించి ఐదు రోజుల ముందే ఎలా లీక్ అయింది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి మావోయిస్ట్‌ల ప్రభావం ఉన్న గ్రామాలకు వెళుతున్నారు. అందులోనూ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వీఐపీల పర్యటనలు అత్యంత గోప్యంగా ఉంటాయి. కానీ కిడారి కార్యక్రమాన్ని ఐదు రోజుల ముందే బయటపెట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కోణంలో కూడా పోలీస్ దర్యాప్తు జరపాల్సి ఉంది.

గూడ క్వారీ ఎవరిది?
డుంబ్రిగుడ మండలం గూడ వద్ద కిడారి నిర్వహిస్తున్న క్వారీ వెనుక ఎవరు ఉన్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాధారణంగా ఏజెన్సీలో మైనింగ్‌కు అనుమతులు ఇవ్వాలనుకుంటే, అవి గిరిజనులకే ఇవ్వాలి. గిరిజనేతరులకు మైనింగ్ లీజ్ ఇచ్చే అవకాశం ఉండదు. కిడారిని అడ్డుపెట్టుకుని వేరెవరైనా ఈ క్వారీని నడుపుతున్నారా.. ఈ విషయం కిడారి కుటుంబ సభ్యులకు తెలుసా? గూడ క్వారీని మూసేయమని మావోయిస్ట్‌లు కిడారిని చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ఆందోళనలు నిర్వహించారు. తన ప్రాణాలకు ముప్పుదని తెలిసినా, కిడారి క్వారీని ఎందుకు మూయలేదు. కిడారి కుటుంబ సభ్యులు కూడా క్వారీని మూసేయమని చెపుతూ వస్తున్నారు. అయితే, దీనివెనుక ఉన్న వ్యక్తుల వత్తిడి మేరకు ఆయన క్వారీ నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఆదివారం కిడారి, సోము ఈ క్వారీ అంశాన్ని చర్చించుకునేందుకు బయల్దేరారన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి.